బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 73 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. ఆనీ మాస్టర్ సైకోయిజంతో పాటు షణ్ముఖ్ ఫేక్ ఎమోషన్స్ అని కాజల్‌ని నిందించడంతో కాజల్ సన్నీదగ్గర కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత కాజల్‌ని టార్గెట్ చేస్తూ అనీ మాస్టర్ కామెంట్స్ చేస్తూనే ఉంది. ఇక తర్వాత కాజల్ ఏడ్చిన దాన్ని వెటకారం చేస్తూ వెళ్లి షణ్ముఖ్ దగ్గర చెబుతూ రవి మరింత చెత్తగా ప్రవర్తించాడు. ఇక ప్రియాంక …సన్నీ దగ్గర కూర్చుని మానస్ గురించి తెగ బాధపడిపోయింది. అతి ప్రేమ కూడా ప్రమాదమే అని అన్నాడు సన్నీ. ఐ లైక్ మానస్.. బట్ నా గేమ్ నేనే ఆడుకుంటున్నా.. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అంటే.. అది బయటకు వేరే విధంగా వెళ్తుంది… నా జీవితంలో ఇలాంటి వాళ్లని ఎంతో మందిని చూశా అని బాధపడింది.
హౌస్‌లో తక్కువ మంది ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 17 కెమెరాలు 19 మంది ఉన్నప్పుడు వేరు.. 17 కెమెరాలు 9 మంది ఉన్నప్పుడు వేరు.. చాలా వేరు అని సిరికి హితబోధ చేశాడు షణ్ముఖ్. ఆ తరువాత ఇద్దరూ అదే సోఫా.. అదే మోజ్ రూంలో కూర్చుని సన్నీ గురించి మాట్లాడుకున్నారు. వాడెవడు నన్ను అమ్మడానికి అని సిరి అంటే.. నువ్ ఇలాగే ఆలోచిస్తున్నావ్.. అమ్మేయడం అంటే అర్థం ఏంటి అంటూ షణ్ముఖ్ అంటే నాకు అర్థం అయ్యిందని సిరి చెప్పింది.సిరి-సన్నీల మరింత గ్యాప్ పెంచేలా షణ్ముఖ్ మరింతగా రెచ్చగొట్టాడు.
షణ్ముఖ్‌కి దిష్ఠి ఎక్కువ తగిలేస్తుందట.. అందుకోసం అతనికి దిష్టి పూసలు రవితో కట్టించింది. షణ్ముఖ్ అడ్డా.. మోజ్ రూంలోకి వెళ్లి సన్నీ మాట్లాడుతుండగా.. సిరి వచ్చి దిష్ఠి పూసలు బ్యాండ్ తొడిగింది. ఇదేంటి అని షణ్ముఖ్ అడగ్గా.. బ్లడ్ అని చెప్పింది. నా బ్లడ్‌ని పూసలకి రాసి బ్యాండ్ చేశా.. దాని వల్ల నీకు దిష్ఠి తాకదు అని చెప్పింది.
ఇద్దరం ఒకే బెడ్‌పై పడుకోవద్దని అన్నందుకు సిరి ఫీల్ అయిపోయింది. షణ్ముఖ్ లేచి వెళ్లి సిరి బెడ్‌పై కూర్చోగా సిరి ఏడుస్తూ లేచి వెళ్లిపోయింది.తర్వాత సిరి.. షణ్ముఖ్ వేరు వేరు బెడ్స్‌పై పడుకుని రాత్రి జరిగిన దానిపై మాట్లాడుకున్నారు. నువ్ రాత్రి ఒకలా ఉంటావ్.. పగలు ఒకలా ఉంటావ్ అని అంటావా? అని షణ్ముఖ్‌ని అడిగింది.
తర్వాత షణ్ముఖ్ వాష్ రూం దగ్గర కూర్చుని దీప్తిని తలుచుకుని ఏడ్వడం.. సిరి వచ్చి ఓదార్చడం.. రవి రావడం మరింత ఎక్కువ చేయడం ప్రేక్షకులకు చికాకు తెప్పించింది.