బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 69 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 69వ ఎపిసోడ్‌లో భాగంగా వచ్చే వారం కెప్టెన్‌గా ఎంపికయ్యారు రవి. తొలుత గెస్ట్‌గా వచ్చిన కాజల్ దగ్గర డబ్బులు నొక్కేసిన రవి.. వాటిని తిరిగి ఇచ్చేశాడు. సిరి- షణ్ముఖ్ మధ్య మళ్లీ అదే చెత్త. ఇక సన్నీ అయితే ఏకంగా అనీ మాస్టర్ పై గుర్రం స్వారీ చేశారు.
తర్వాత రవి…కాజల్‌ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేయగా అది ఏమాత్రం ఫలించలేదు. ఆనీ మాస్టర్.. సన్నీకి మసాజ్ చేస్తుంటే.. శ్రీరామ్ అదిరిపోయే ఆర్ ఆర్ వేశాడు. ఇక బీబీ హోటల్ టాస్క్‌లో వరస్ట్ పెర్ఫామెన్స్ ఎవరనుకుంటున్నావ్ అని రవి షణ్ముఖ్‌ని అడగ్గా.. మానస్, పింకీ అని చెప్పాడు. వాళ్లు అసలు ఏం పెర్ఫామెన్స్ చేయలేదని ముగ్గురూ ముచ్చటించుకున్నారు. మొత్తంగా బీబీ హోటల్ టాస్క్‌లో హోటల్ స్టాఫ్.. అతిథుల నుంచి డబ్బులు సంపాదించడంలో విఫలం కావడంతో అతిథులు ఈ టాస్క్‌లో విజయం సాధించినట్టు ప్రకటించారు బిగ్ బాస్.
అతిథుల టాస్క్‌లో ఉన్న సన్నీ, కాజల్, మానస్, ప్రియాంక, సిరిలు గెస్ట్‌లుగా ఉన్నారు. అయితే యాంకర్ రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌ని రవి విజయవంతంగా పూర్తి చేయడంతో రవిని మొదటి కెప్టెన్సీ పోటీదారుడిగా ప్రకటించారు. అయితే ఈ టాస్క్‌లో ఓడిపోయిన హోటల్ స్టాఫ్‌ని అభినందిస్తూ ఒక పవర్ ఇచ్చారు బిగ్ బాస్. హోటల్ స్టాఫ్ ఏకాభిప్రాయంతో అతిథుల టీం నుంచి కెప్టెన్సీ పోటీదారులుగా ఇద్దర్ని అనర్హులుగా ప్రకటించవచ్చని చెప్పారు బిగ్ బాస్. దీంతో చర్చల అనంతరం కెప్టెన్ ఆనీ మాస్టర్.. ప్రియాంక, మానస్‌లను అనర్హులుగా ప్రకటించింది.
దీంతో ఈవారం కెప్టెన్సీ పోటీదారులుగా రవి, సిరి, సన్నీ, కాజల్‌లను ప్రకటించారు బిగ్ బాస్. కిచెన్ ఛాంపియన్ ఆఫ్ ది వీక్‌గా ఒకర్ని ఎంపిక చేసే అవకాశం ఆనీ మాస్టర్‌కి ఇచ్చారు . దీంతో షణ్ముఖ్‌ని కిచెన్ ఛాంపియన్ ఆఫ్ ది వీక్‌గా ప్రకటిస్తూ ప్రేస్టేజ్ తరుపున అతనికి రూ.25 వేల గిఫ్ట్ ఓచర్‌ని అందించింది. ఈ కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా రవి, సిరి, సన్నీ, కాజల్‌లకు బ్రిగ్స్‌తో టవర్స్ కట్టే టాస్క్ ఇచ్చారు. టవర్‌ని కట్టడంతో పాటు కట్టిన టవర్‌ని కూలిపోకుండా కాపాడుకోవాలని.. మిగిలిన ఇంటి సభ్యులు ఆ టవర్‌ని కూలగొట్టడానికి బాల్స్‌తో కొట్టాలని చెప్పారు. ఈ టాస్క్‌లో గెలిచి హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు యాంకర్ రవి.