బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 3 హైలైట్స్

89
bb5

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 3 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకుంది. ఈ వారం ఎలిమినేషన్‌లో యాంకర్ రవి,కాజల్,సరయు,హమీదా,జస్వంత్ పడాల (జెస్సీ),మానస్ ఉన్నారు. ఇక 3వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదంతో చేపల మార్కెట్‌ను తలపించింది.

రెండో రోజు ఎపిసోడ్ రచ్చ మూడో రోజు కంటిన్యూ అయింది. తొలుత ట్రాన్స్ జెండర్‌గా మారిన ప్రియాంక…. తాను ఎందుకు అలా మారాల్సి వచ్చిందో చెప్తూ మళ్లీ తన కష్టాలను హౌస్ మేట్స్‌తో చెబుతూ తెగ బాధపడి పోయింది. ఇంట్లో పనులు చేయకుండా ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారని శ్వేత, సరయులు మాట్లాడుకోగా కొంతమంది వర్క్ చేయడం లేదని అన్నది సరయు.

ఈ సీజన్‌లో కొత్తగా ప్రారంభించిన పవర్ రూం పవర్ కోసం ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం ఈ పవర్ రూం పవర్‌ని సంపాదిస్తే.. ఆటని మార్చే శక్తి లభిస్తుందని చెప్పారు. ఈవారం కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ ‘శక్తి చూపరా డింబకా’ అని.. దీనిలో భాగంగా ఇంట్లో ఉరుముల శబ్ధం వచ్చిన ప్రతిసారి ఇంటిసభ్యులు వెళ్లి పవర్ రూం ముందు ఉంచిన బటన్‌ని ప్రెస్ చేయాలని ఎవరైతే అందరికంటే ముందు వెళ్లి బటన్‌ని ప్రెస్ చేస్తారో వాళ్లకే పవర్ రూం శక్తి లభిస్తుందని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

ఈ పవర్ రూం టాస్క్‌లో విశ్వ విజేతగా నిలిచారు. మరోవైపు చూడ్డానికి బలంగా కండలు తిరిగిన శరీరంతో కనిపించే విశ్వ.. చనిపోయిన తన తమ్ముడ్ని గుర్తు చేసుకుని బోరు బోరున ఏడ్చేశాడు. యాంకర్ రవి.. తనని అన్నా అని పిలవడంతో.. తన తమ్ముడ్ని గుర్తు చేసుకున్నాడు. ఇక లోబో-సిరిలు గట్టిగా అరుస్తూ గొడవపడ్డారు. అయితే వాళ్లు ఆట పట్టించడానికే గొడవపడినట్టు చివర్లో తుస్ అనిపించడంతో ఇంటి సభ్యులంతా కంటెంట్ కోసం ఇలా చేయొద్దని చురకలు వేసింది సరయు. ఇక హౌస్‌లో కాజల్-లహరిల మధ్య హీట్ డిస్కషన్ నడించింది..ఇక జెస్సీ మరోసారి హమీదాతో గొడవకు దిగాడు. దీంతో ఆనీ మాస్టర్ ఇచ్చిపడేసింది. కూర్చుని ఉండే స్టూల్‌పై కాలుపెట్టి జెస్సీ తన యాటిడ్యూడ్ చూపించాడు. దీంతో ఆనీ మాస్టర్ అతనిపై రంకెలు వేసి రచ్చ రచ్చ చేసింది. మొత్తంగా నేటి ఎపిసోడ్ మొత్తం రచ్చ రంబోలాలా సాగింది.