బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 18 హైలైట్స్

109
bb5
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 18 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 18వ ఎపిసోడ్‌లో భాగంగా యాంకర్ రవికి సీక్రెట్ టాస్క్,షణ్ముఖ్‌..సిరి సేఫ్‌ గేమ్‌పై పునరాలోచనలో పడటం,హైదరాబాద్ అమ్మాయి- అమెరికా అబ్బాయి టాస్క్ ముగిసింది. తొలుత హైదరాబాద్ అమ్మాయి.. అమెరికా అబ్బాయి టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు తమ పాత్రలో జీవించేశారు. పెళ్లిళ్ల బ్రోకర్‌గా షణ్ముఖ్ జస్వంత్ ఇరగదీశాడు. అతని వెనుకపడే అమ్మాయిగా ప్రియాంక అదరగొట్టేసింది.

లహరిని పెళ్ళాడటానికి ఇండియా వచ్చిన ఎన్.ఆర్.ఐ. గా నటించిన శ్రీరామ్ ఒకే సమయంలో ఇటు సిరి, అటు హమీదలతో లవ్ ట్రాక్ నడపడం ఆకట్టుకుంది. షణ్ముఖ్ – శ్వేత – లోబో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడపడం కూడా బాగానే ఉంది. ఇక చివరకు ఎవరూ ఊహించని విధంగా అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి టాస్క్‌లో భాగంగా శ్రీరామ్ – లహరి వివాహంతో కథ సుఖాంతమైంది.

నటరాజ్ మాస్టర్ ఇచ్చిన సూచనతో షణ్ముఖ్ కళ్లు తెరుచుకున్నాడు. జెస్సీతో మాట్లాడుతూ.. నాకు ఎక్కడో కొడుతుంది.. వరుస ఘటనలు చూస్తే మన సపోర్ట్ ఇన్ డైరెక్ట్‌గా సిరికి వెళ్లిపోతుంది.. అందుకే బెడ్ మారిపోదాం.. ఆమెను దూరం పెట్టడమే బెటర్ అనిపిస్తుంది అంటూ జెస్సీ ముందు ఓపెన్ అయ్యా డు. ఇక ఎలిమినేషన్‌ రౌండ్‌లో భాగంగా ప్రియ, లహరి ఒకరినొకరు మాటల యుద్దానికి దిగగా స్కిట్ లో మాత్రం అత్త – కోడళ్ళుగా జీవించేశారు. అందులో భాగంగానే ప్రియ, లహరితో కాళ్ళు ఒత్తించుకోవడం, కాళ్ళకు దండం పెట్టించుకోవడం ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది.

రవికి కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ అతనికో సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ప్రియా కు సంబంధించిన నెక్లెస్ ను ఎవరికీ తెలియకుండా దొంగిలించమని, ఆ విషయంలో అతను సక్సెస్ అయితే… కెప్టెన్సీ టాస్క్ లో అతన్ని పరిగణనలోకి తీసుకుంటామని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో ఎవరూ లేని సమయంలో ప్రియా బెడ్ దగ్గరకు వెళ్ళి ఆమె నెక్లెస్ ను రవి తీసుకుని, వేరే చోట దాచిపెట్టాడు.

- Advertisement -