బిగ్ బాస్ 5..ఈ వారం నామినేషన్స్‌లో ఎంతమందో తెలుసా?

24
bb5

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 12వ వారంలోకి ఎంటర్‌ అయింది. ఇక సోమవారం ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. హౌస్‌లో ప్రస్తుతం 8 మంది ఉండగా 7గురు శ్రీరామ్ చంద్ర, సన్నీ, రవి, ప్రియాంక, కాజల్, సిరి, షణ్ముక్‌కు నామినేట్ అయ్యారు. కెప్టెన్‌గా ఉన్న మానస్‌ ఒక్కడికి మినహాయింపు లభించింది.

నామినేషన్స్‌లో పాల్గొని ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి దిష్టిబొమ్మపై కుండ పెట్టి పగలగొట్టాలని.. ఒక్కొక్కరు ఇద్దరిద్దర్ని నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. మొదటగా అంతా ఊహించినట్లుగానే సన్నీని నామినేట్ చేయగా వీరిద్దరి మధ్య హాట్ హాట్‌గా డిస్కషన్ నడిచింది. ఇక తర్వాత కాజల్‌ని నామినేట్ చేశారు రవి.

తర్వాత ప్రియాంక… షణ్ముఖ్‌,సిరిని నామినేట్ చేసింది. వికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన షణ్ముఖ్. ఇక రవిని నామినేట్ చేస్తూ షణ్ముఖ్ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. ఇక రెండో నామినేషన్స్‌లో భాగంగా కాజల్‌ని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో సన్నీ వల్ల నేను వెళ్లకపోయానని అందుకే సన్నీని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు శ్రీరామ్. ఇక రెండో నామినేషన్స్‌‌లో భాగంగా కాజల్‌ని నామినేట్ చేశాడు.

ఇక తర్వాత సన్నీ.. రవిని నామినేట్ చేశాడు సన్నీ. నువ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు వరుసగా పనులు చెప్పావ్.. కెప్టెన్ అంటే పని చేయించడమే కాదు.. చేయడం కూడా అని చురకలేశాడు. తర్వాత శ్రీరామ్ తన పేరు చెప్తూ ఏంటి కొడతావా? కొట్టు అంటూ సన్నీమీదికి దూసుకుని వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇంటి పేరుతో సహా పేరు చెప్పి ఆ పేరుతో పిలవాలని చెప్పడం కాస్త ఓవర్‌గానే అనిపించింది.

ఇక సిరి.. రవి, ప్రియాంకలను నామినేట్ చేసింది. ఇక కాజల్ రవిని నామినేట్ చేస్తూ ఈ హౌస్‌లో నాకు ఇష్టం లేని వ్యక్తి ఉన్నారంటే అది నువ్వే అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. ఇక శ్రీరామ్‌ని నామినేట్ చేస్తూ.. గేమ్ అయిపోయిన ఆనీ మాస్టర్ ఉసురు పోసుకున్నా అని అనడం ఏంటి? గేమ్‌లో ఉసురు ఏంటి? ఆ మాట నాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది కాజల్. మానస్ చివరగా శ్రీరామచంద్ర, రవిని నామినేట్ చేశాడు. దీంతో ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారు.