ఫిబ్రవరి 25న ఎఫ్‌3..కథ ఇదే!

92
f3
- Advertisement -

వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మోర్ ఫ‌న్ రైడ‌ర్ ‘ఎఫ్3’. ఈ సినిమా 2022 ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక ఇవాళ అనిల్ రావిపూడి బర్త్ డే సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘ఎఫ్3’ఫ్రస్ట్రేషన్‌ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందని, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి పుట్టే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందని అన్నారు.

వెంకటేష్‌ రేచీకటితో బాధపడుతుంటాడు. వరుణ్‌తేజ్‌కు కొంచెం నత్తి ఉంటుంది. వాళ్లకుండే ఆ సమస్యల నుంచి కూడా చక్కటి వినోదం తీసుకొచ్చామన్నారు. రెండో భాగంలో సునీల్‌, మురళీశర్మ వంటి నటులు కూడా ఉండటంతో సినిమాకి చాలా ప్లస్ అవుతుందని అన్నారు. కథాపరంగా ఎక్కువ మంది ఆర్టిస్టులు అవసరమయ్యారు. క్లైమాక్స్ సన్నివేశాల్ని 35 మంది ఆర్టిస్టులతో తీశాను. ఇంతమందిని ఒకేసారి హ్యాండిల్ చేయడం చాలా ఛాలెజింగ్‌గా అనిపించిందని చెప్పుకొచ్చారు అనిల్.

- Advertisement -