బిగ్ బాస్‌…ఎట్టకేలకు కెప్టెన్‌గా సొహైల్‌!

391
sohail
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు శుక్రవారంతో విజయవంతంగా 33 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక 33వ ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌ ఆసక్తికరంగా సాగింది. బీబీ హోటల్ టాస్క్‌లో విజేతగా నిలిచిన గెస్ట్‌ల టీం నుండి బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సొహైల్ తొలి కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక కాగా హోటల్ టీం నుండి ఎక్కువ టిప్ సాధించిన అఖిల్, సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తిచేసిన అవినాష్ కెప్టెన్సీ రేసులో నిలిచారు.

అయితే సొహైల్‌ ఈ సారి తాను కెప్టెన్సీ రేసులో ఉండాల్సిందేనని మెహబూబ్‌తో పాటు గెస్ట్ టీం సభ్యులతో తెలిపారు. తొలుత కొంతసేపు వాదన జరిగిన చివరికి మెహబూబ్ …సొహైల్‌ కోసం త్యాగం చేయడం మిగితా సభ్యులు కూడా సొహైల్ పేరు చెప్పడంతో ఈ వారం కెప్టెన్‌ రేసులో నిలిచారు సొహైల్‌.

తర్వాత కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా అవినాష్‌,అఖిల్,సొహైల్‌లకు మంచు నిప్పు- మ‌ధ్య‌లో ఓర్పు అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్కుకు అభిజిత్ సంచాల‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. త‌ర్వాత టాస్కు మొద‌ల‌వ‌గా కింద మంట‌ల వేడి, చేతిలోని ఐస్ గ‌డ్డ చ‌ల్ల‌ద‌నాన్ని త‌ట్టుకునేందుకు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించారు.

హోరాహోరిగా సాగిన ఈ పొరులో తొలుత అఖిల్ ఔట్ కాగా తర్వాత కాసేపు పోరాడిన అవినాష్ నొప్పులు భరించలేక గద్దె దిగిపోయాడు. దీంతో సొహైల్ విజేతగా నిలిచి కెప్టెన్‌గా ఎన్నికయ్యారు. మెహబూబ్ కోసమే తాను ఇంత నొప్పిని భరించానని విజేతగా నిలిచిన అనంతరం చెప్పారు సొహైల్. మొత్తంగా ఇంటి కెప్టెన్‌గా ఎన్నికవ్వాలన్న తన కోరికను నెరవేర్చుకున్నాడు సొహైల్.

- Advertisement -