మరో బాంబ్ పేల్చి…తల్లిదండ్రులకు షాకిచ్చిన లాస్య!

184
lasya
- Advertisement -

బిగ్ బాస్ 4 తెలుగు ఎపిసోడ్ 68లో భాగంగా ఇంటి సభ్యులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఎవరికి చెప్పని సీక్రెట్ రీవిల్ చేయాలని అందుకు ప్రతిఫలంగా ఆప్తుల నుండి లెటర్ అందుకుంటారని చెప్పారు.బిగ్ బాస్ వల్ల తన తల్లిదండ్రులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నానని తెలిపింది లాస్య. తన భర్త తనకంటే ఏడాది చిన్నవాడని సీక్రెట్‌ని భయటపెట్టింది. అంతేకాదు అతను చాలా పేదవాడని ఏం లేదని చెప్పుకొచ్చింది.

2017లో పెద్దల సమక్షంలో మా పెళ్లి అయ్యింది. పెళ్లైనప్పుడు నేను ఒక మరాఠీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పా..అందరూ అనుకున్నారు.. కోటీశ్వరుడు డబ్బులున్న అబ్బాయి అనుకున్నారు. తను మిడిల్ క్లాస్ కూడా కాదు. అతని ఫైనాన్సియల్ స్టేటస్ నాకు మాత్రమే తెలుసు. నాకంటే ఆ అబ్బాయి ఒక సంవత్సరం చిన్న. ఆ విషయం తెలిసిన తరువాత నాకంటే ఏడాది చిన్నవాడ్ని నేను లవ్ చేశానా?? అని ఎలా

రియాక్ట్ అవ్వాలో తెలియదు. అమ్మా మీ అల్లుడు నాకంటే ఏడాది చిన్న.. వయసులో చిన్నవాడైనా పెద్ద మనసు.. చాలా బాగా చూసుకుంటాడు అని తెలిపి షాక్ ఇచ్చింది లాస్య.

- Advertisement -