మాస్టర్‌పై బిగ్ బాంబ్..హారిక వంకాయ!

218
harika
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 4 ఆరోవారంలో ఇంటి నుండి బయటకు వచ్చారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కుమార్ సాయి. అయితే పోతూ పోతూ మాస్టర్‌పై బిగ్ బాంబ్‌….హౌస్‌లో హారిక వంకాయ లాంటిదని తనకు నచ్చదని తెలిపాడు.

ఇంటి స‌భ్యులంద‌రినీ ఒక్కో కూర‌గాయ‌తో పోల్చాడు కుమార్ సాయి. అరియానాను ఉల్లిపాయ, అవినాష్‌ను ఆట‌లో అర‌టిపండును, అఖిల్‌ను క‌రివేపాకు, మాస్ట‌ర్‌ను కాక‌ర‌కాయ, అభిజిత్ కూల్ కీర‌దోస‌గా, లాస్యను మొక్క‌జొన్న‌(ముసుగులో న‌వ్వే వ్య‌క్తి)గా, నోయ‌ల్ మెల్లిమెల్లిగా తెరచుకునే వ్య‌క్తి క్యాబేజీగా, సోహైల్ టైమ్‌పాస్ వేరుశెన‌గ‌కాయగా చెప్పుకొచ్చాడు.

ఇక దివి పైనాపిల్(లోప‌ల బాగానే ఉన్నా పైన‌కు కోపంగా క‌నిపించే వ్య‌క్తి)‌గా, హారికను త‌న‌కు న‌చ్చ‌ని వంకాయగా, మెహ‌బూబ్‌ను ఉడ‌క‌బెట్టిన గుడ్డుతో పోల్చాడు. ఇక చివరగా వారం రోజుల‌పాటు వాష్‌రూమ్స్ శుభ్రం చేయాల‌న్న బిగ్‌బాంబ్‌ను కుమార్ మాస్ట‌ర్‌పై వేశాడు కుమార్ సాయి. అయితే తాను బిగ్ హౌస్‌లోకి వచ్చే ముందు అనుకున్న మూడు కోరికల్లో తనకిష్టమైన కోరిక నెరవేర్చుకుని వెళ్లాడు కుమార్ సాయి. తాను చెప్పే సినిమా కథను నాగ్ వింటానని తెలపడంతో ఆనందంతో నవ్వుతూ వెళ్లిపోయాడు.

- Advertisement -