బిగ్ బాస్ 4…..కుమార్ సాయి ఎలిమినేట్!

62
kumar sai

బుల్లి తెర రియాల్టీ షో బిగ్ బాస్ విజయవంతంగా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఆరో వారంలో ఇంటి నుండి ఎవరూ ఉహించని విధంగా కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు. చివరి వరకు ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న సస్పెన్స్‌ను కొనసాగిస్తూ మోనాల్,కుమార్ సాయి ఇద్దరిని కన్ఫెషన్‌ రూమ్‌కి పిలిచిన నాగ్…కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారని ప్రకటించారు.

అయితే వాస్తవానికి ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉంది మోనాల్. దీంతో మోనాల్ ఎలిమినేషన్ పక్కా అని అంతా అనుకున్నారు కానీ ఎందుకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కుమార్‌ని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్.

కుమార్ సాయి ఎప్పటిలానే యాక్టివ్‌గా హుషారుగా మోనాల్‌కి బాయ్ చెప్పి నాగార్జున దగ్గరకు వచ్చేశారు. హౌజ్‌లోకి వెళ్తున్నప్పుడు మూడు కోరికలతో వెళ్తున్నానని మీకు చెప్పాను. ఒకటి నేను గెలవాలని వచ్చాను, రెండు నేను బయటికి వెళ్లేటప్పటికి వ్యాక్సిన్ వచ్చి ఉండాలి. అది రాలేదు. మూడోది మీకు కథ చెప్తానని అన్నాను. మీరు ఎప్పుడైనా వినడానికి ఛాన్స్ ఇవ్వండి సార్ అని కుమార్ అనగానే నాగ్ ఒకే చెప్పాడు. దీంతో సాయి ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి.