బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 97 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 97వ ఎపిసోడ్‌లో భాగంగా మోనాల్‌కి గోల్డ్ మైక్ దక్కగా సొహైల్- అరియానా పంచాయితీ ఇంకా కంటిన్యూ అవుతునూ ఉంది.
మార్నింగ్ వేకప్ సాంగ్‌లో భాగంగా ఇంటి సభ్యులంతా స్టెప్పులు వేస్తూ బిగ్ బాస్ హౌస్‌ని హుషారెత్తించారు. హారిక ఏదో పనిచేసుకుంటూ కిచెన్‌లో ఉండగా..అఖిల్ మెల్లగా ఆమె దగ్గరకు చేరాడు. హారికను వెనకనుంచి వాటేసుకుని ఏం షాంపూ ఇది.. మా దగ్గర లేదే నీ దగ్గరకు ఎలా వచ్చింది?? అంటూ మొదలుపెట్టాడు.
హారిక కూడా అఖిల్‌కి తగ్గట్టుగానే రెచ్చిపోయింది. బాత్ రూంలో నీ కళ్లు ఎక్కడ పెట్టుకుని స్నానం చేస్తున్నావో అంటూ మాట్లాడగా కళ్లా మేమా చెప్తే బాగోదు అంటూ అఖిల్ డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రెచ్చిపోయాడు. ఈ మనిషి మామూలోడు కాదు అని సొహైల్ అనగా మరి నువ్వూ అని అడిగాడు అఖిల్. తాను ఈ పులిహోరలు కలిపే రకం కాదు ముక్కు సూటిగా చెప్తా.. నీలా పులిహోర కలపడం తెలియదు అంటూ అఖిల్‌కి పంచ్ ఇచ్చాడు సొహైల్.తర్వాత ఫొటో బూత్‌లో ఫొటోలు టాస్క్ ఇవ్వగా అభిజిత్, హారిక,అరియానా, మోనాల్‌లు పోటీ పడగా ఇద్దరు మిత్రులు సొహైల్, అఖిల్‌లు జడ్జీలుగా వ్యవహరించారు.ఈ టాస్క్‌లో మోనాల్ విజేతగా నిలిచింది. తర్వాత మ్యూజిక్ డాన్స్ టాస్క్ ఇచ్చారు. తాము ధరించే షూ కంటే ఒక నెంబర్ షూ ధరించి డ్యాన్స్ చేయాలని…ఆపకుండా డ్యాన్స్ చేయాలని తెలిపిన బిగ్ బాస్ మ్యూజిక్ ఆగిన ప్రతీసారి ఒకరు దిగిపోతారని చెప్పారు. ఈ టాస్క్‌కి అఖిల్ జడ్జీగా ఉంటాడని చెప్పారు. విజేతగా నిలిచిన వ్యక్తికి గోల్డ్ మైక్ లభిస్తుందని తెలిపారు.
తొలుత ఇంటి సభ్యుల డ్యాన్స్ అనంతరం మ్యూజిక్ ఆగగా చాలాసేపు డిస్కషన్ తర్వాత అభిజిత్ దిగిపోయారు. ఇక రెండోసారి అరియానా,మూడోసారి సొహైల్,చివరగా హారిక స్టేజీ మీద నుండి దిగిపోయింది. దీంతో మోనాల్ విజేతగా నిలిచింది. అయితే సొహైల్ దిగిపోయేటప్పుడు అరియానాను టార్గెట్ చేస్తూ గొడవ జరగడానికి గల కారణాలను వివరిస్తూ కౌంటర్ వేశాడు. ఇక విజేతగా నిలిచిన మోనాల్ ప్రేక్షకులతో మాట్లాడి తనకు మద్దతివ్వాలని కోరింది.
ఇక తెగబాధపడుతన్న సొహైల్‌కి క్లాస్ పీకాడు అభిజిత్. నీ గురించి నువ్ మాట్లాడు.. హౌస్‌లో ఉన్న అందరి కోసం నీకెందుకు.. అంటూ అరియానా పేరును పదే పదే తీసుకురాకు అని సూచించాడు. దీంతో ఎపిసోడ్ ముగిసింది.