బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 88 హైలైట్స్

76
episode 88

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 88 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 88వ ఎపిసోడ్‌లో భాగంగా రేస్ టూ ఫినాలేకు అఖిల్,సోహైల్ అర్హత సాధించగా అవినాష్-మోనాల్ మధ్య డిస్కషన్‌తో ముగిసింది.

తొలుత మార్నింగ్ వేకప్ సాంగ్‌కి ఇంటి సభ్యులు డ్యాన్స్ చేయగా అవినాష్ మాత్రం మోనాల్ నన్ను తన్నింది? అంటూ నిన్నటి రచ్చను మళ్లీ షురూ చేశాడు. తను తన్నడం తనకు నచ్చలేదని ఇది సరికాదని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక సొహైల్, అభి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా ఆమె దగ్గరకు పోతేనే ఏదో ఔతుంది.. ఏం కలిసిరాదని మోనాల్‌ తీరును తప్పుబట్టాడు. ఆమె అబద్ధాలు ఆడుతుంది.. నాకు తెలుసు ఆమె గురించి అందుకే కదా ఆమెతో ఫ్రెండ్ షిప్ వద్దని చెప్పింది. పట్టు పడని వాటి దగ్గర ఆమె తెలివిగా చేస్తుంది.. ఆమె గురించి చెప్పడం ఎందుకులే వదిలెయ్ అని చెప్పాడు అభి.

ఆ తరువాత కిచెన్‌లో ఉన్న మోనాల్ దగ్గరకు వెళ్లిన సొహైల్.. నువ్ అభిజిత్‌ని తన్నిన వీడియో కానీ చూపిస్తే మాత్రం నిన్ను గట్టిగా కొడతా అని వార్నింగ్ ఇచ్చాడు. నేను తప్పు చేయలేదు ఎందుకు కొడతావ్.. నేను బాటిల్‌నే తన్నా.. కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నా.. అని చెప్పింది మోనాల్. అయితే సొహైల్ పక్కకు వెళ్లిన తరువాత ‘నేను కన్ఫ్యూజ్‌లో ఉన్నా….. నన్ను కన్ఫషన్ రూంకి పిలిచి క్లారిటీ ఇవ్వండి బిగ్ బాస్ అంటే ప్రాధేయపడింది మోనాల్.

అవినాష్ దగ్గరకు వెళ్లి నన్ను క్షమించు.. నేను కావాలని తన్నలేదు.. నువ్ అంత హర్ట్ అవుతావ్ అని అనుకోలేదు.. ఏమైందో నాకు తెలియలేదు.. అంటూ అవినాష్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసింది. చివరగా అరియానా వచ్చి మనం ఇలాగే ఉండాలి అంటూ.. ఈ ముగ్గురు కలిసి కౌగిలించుకున్నారు. దీంతో రెండు రోజుల నుంచి నన్ను తన్నింది. తర్వాత సొహైల్-అఖిల్‌లు విడివిడిగా గేమ్ ఆడితే బాగుండేదని.. ఇద్దరూ కలిసి ఎలా ఆడుతారని అవినాష్ ప్రశ్నించడంతో రచ్చ రేగింది. మా గేమ్ ప్లేన్ కలిసి ఆడటం.. మా స్మార్ట్ గేమ్ ఆది అని సొహైల్, అఖిల్‌లు వాదించారు.

ఇక రేస్ టూ ఫీనాలే రెండో లెవల్‌లో భాగంగా పైనుండి పువ్వులు పడతాయని వాటిని గార్డెన్ ఏరియాలోని మట్టిలో నాటాలని ఎవరు తక్కువగా నాటితే వారు ఓడిపోయినట్లేనని తెలిపారు. తొలుత ఈ రౌండ్‌లో హారిక తర్వాత అభిజిత్ గేమ్ నుండి ఔటయ్యారు. ఇక చివరగా మిగిలింది సోహైల్-అఖిల్. నేటి ఎపిసోడ్‌లో రేస్ టూ ఫినాలేకు అర్హత సాధించింది ఎవరో తెలిసిపోనుంది.