మొక్కలు నాటిన ఏఎంసీ ఛైర్మన్ కవ్వంపల్లి లక్ష్మీరాములు..

80
gic

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మార్కెట్లో మొక్కలు నాటారు AMC ఛైర్మెన్ లక్ష్మి రాములు.

ఈ సందర్భంగా లక్ష్మి రాములు మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించాలంటే బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించడమే మనం ఇచ్చే గొప్ప సంపద అని తెలిపారు.

ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టి ముందు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నా తరుపున చింతలపల్లి వెంకట్ రెడ్డి నల్లగొండ అనిల్ కుమార్ జంగిడి సంజీవ్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.