బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 58 హైలైట్స్

219
episode 58
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 58 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 58వ ఎపిసోడ్‌తో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ సగం జర్నీ పూర్తయిందని ఇప్పటినుండి అసలు ఆట ఉండనుందని తెలిపారు బిగ్ బాస్‌. ఇక ఈ ఎపిసోడ్‌ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. అరియానా వర్సెస్ సొహైల్,అభిజిత్ వర్సెస్ అవినాష్‌ మధ్య మాటలయుద్ధంతో హౌస్‌లో హీట్ పెరిగిపోయింది.

తొలుత వాష్ రూమ్ దగ్గర అఖిల్, మోనాల్‌లు ముచ్చట్లు పెట్టారు. నువ్ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావ్.. నా పక్కన ఎందుకు కూర్చోలేదు మోనాల్ ఫీల్ అవగా అలాంటిదేమి లేదని చెప్పుకొచ్చాడు అఖిల్. అయితే హగ్ ఇవ్వు అని అనగా అఖిల్ మనస్పూర్తిగా కౌగిలించుకోకపోవడంతో అలిగి అక్కడి నుండి వెళ్లిపోయింది మోనాల్.మార్నింగ్ వేకప్ సాంగ్ వేసిన సొహైల్, మెహబూబ్‌లు ఇద్దరూ పడుకోవడంతో బిగ్ బాస్ ఇంట్లో కుక్కలు మొరిగాయి. దీంతో పనిష్మెంట్‌గా మెహబూబ్ రెండు బకెట్లతో స్నానం చేశాడు. తర్వాత సొహైల్ పడుకోవడం మళ్లీ కుక్కలు అరవడంతో అరియానా వచ్చిన సొహైల్ స్నానం చేయాలని తెలిపింది.

నేను ఇప్పుడే స్నానం చేశా.. సాయంత్రం చేస్తా అని అరియానాతో చెప్పగా ఆమె కుదరదని చెప్పడంతో ఆవేశంతో స్విమ్మింగ్‌ ఫూల్‌లోకి దూకాడు. ఆగ్రహంతో ఊగిపోతూ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రాను అంటూ రచ్చరచ్చ చేశాడు. కాసేపటి తర్వాత బయటకు వచ్చినా తడి బట్టలతోనే వచ్చి ఆగమాగం చేశాడు. నేను మళ్లీ పడుకుంటా.. మళ్లీ స్విమ్మింగ్ పూల్‌లో దూకుతా.. ఈసారి నాకు పనిష్మెంట్ ఇస్తే నేను చేయ్యను… ఏం చేస్తారో చేసుకోండి అని తేల్చిచెప్పేశాడు. ఈలోపు డ్రెస్ మార్చుకుంటూ మైక్ తీసి పక్కన పెట్టడంతో బిగ్ బాస్ నుంచి మైక్ ధరించాలని అనౌన్స్ మెంట్ వచ్చింది.

ఇక మళ్లీ అరియానా వచ్చి సొహైల్‌కి మళ్లీ పనిష్మెంట్ ఇవ్వడంతో తాను చేయనంటూ పిచ్చిపిచ్చిగా చేశాడు. గొడవ పెద్దది చేస్తూ సొహైల్ షూ లేస్ తీసుకున్న అరియానా దాన్ని తిరిగిఇవ్వకపోవడంతో దానిని బేస్ చేసుకుని నా లేస్ ఇవ్వలేదు కాబట్టి.. పనిష్మెంట్ ఇస్తా అంటూ గొడవకు దిగాడు.

ఇక 9వ వారం నామినేషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ షో సగం పూర్తైందని ఇప్పటి నుంచి ఇంటి సభ్యులు అసలు ఆట మొదలుకాబోతుందని తెలిపాడు.బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు బిగ్ బాస్ ఎవరి పేరు చెప్తారో వాళ్లు వెళ్లి ఇద్దరి తలపై కోడు గుడ్లు పగలకొట్టాల్సి ఉంటుందని చెప్పారు. కెప్టెన్ అయినందునా అరియానాను నామినేట్ చేసేందుకు లేదని తెలిపిన బిగ్ బాస్…మొదటిగా కెప్టెన్ అరియానాకి బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

ఆమె మొదటి గుడ్డుని హారిక తలపై గుడ్డు పగలగొట్టింది. రెండో గుడ్డుని సొహైల్ తలపై కొట్టింది దీంతో మళ్లీ గొడవ జరిగింది. ఇప్పటి వరకూ 8 మంది కెప్టెన్లు అయ్యారు.. నేనూ అయ్యా.. నీలా ఎవరూ చేయలేదు.. నీ యాటిట్యూడ్ చూపించకు.. నువ్ పెద్ద పుడింగిలా ఫీల్ అయిపోకు అంటూ ఫైర్ అయ్యాడు సొహైల్. తర్వాత కూడా ఇద్దరి మధ్య మాటలయుద్దం కొనసాగుతూనే ఉంది.

తర్వాత అవినాష్ వంతు రావడంతో అభిజిత్,హారికలను నామినేట్ చేశాడు. ఇక అభిజిత్‌తో చర్చ సందర్భంగా నోయల్ చిల్లర కామెడీ అని అన్నప్పుడు మీరు లేచి సీరియస్ అవ్వడం నాకు నచ్చలేదు. నోయల్ పర్సనల్‌గా నన్ను టార్గెట్ చేసినప్పుడు మీరు ఇన్వాల్వ్ కావడం కరెక్ట్ కాదని చెప్పాడు అవినాష్.

సొహైల్ వంతు రావడంతో మోనాల్,అభిజిత్‌లను నామినేట్ చేశాడు. టాస్క్‌లలో బాగా ఆడటం లేదని అందుకే నామినేట్ చేస్తున్నానని తెలపగా హౌస్‌లో తనకు అబద్దాల కోరు అని ట్యాగ్ ఇచ్చారని నేను ఫీల్ అవుతున్నప్పుడు.. నువ్ వచ్చి అన్నీ నీకు సెట్ అవుతాయని అన్నావ్.. అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు సొహైల్. దీంతో ఇద్దరి మధ్య కాసేపు చర్చ జరిగింది.ఇక అభిజిత్.. అవినాష్‌ని నామినేట్ చేస్తూ.. నువ్ ఎప్పుడూ నేను ఎంటర్ టైన్మెంట్ చేస్తా హెల్దీగా చేస్తా అని మీరు అనుకుంటారు తప్పితే.. నాకు అలా

అనిపించదు. నువ్ కామెడీ చేయడానికి వచ్చి ఉండొచ్చు.. కానీ మేం కామెడీ తీసుకోవడానికి రెడీగా అనే రీజన్ తెలపగా సీరియస్ అయిన అవినాష్ తాను కామెడీ చేయడానికే వచ్చానని తెలిపాడు. ప్రాణం పోయే వరకూ పెర్ఫామెన్స్ చేస్తా.. నువ్వేం చేయకుండా కూర్చుంటావ్.. నన్ను కామెడీ చేయొద్దని చెప్పడానికి నువ్ ఎవడివి? అంటూ గట్టిగా చెప్పాడు. దీంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది.

- Advertisement -