తెలంగాణ కరోనా అప్‌డేట్..

139
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 1,536 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,42,506కి చేరాయి.

ఇప్పటి వరకు 2,23,413 మంది కరోనా నుండి కోలుకోగా 1,351 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,742 యాక్టివ్ కేసులుండగా 14,915 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఖమ్మంలో 97,మేడ్చల్‌లో 96,రంగారెడ్డిలో 92,నల్గొండలో 81,జీహెచ్‌ఎంసీ పరిధిలో 281 కేసులు నమోదయ్యాయి.

కరోనా మరణాల రేటు దేశ వ్యాప్తంగా 1.5 శాతంగా ఉంటే తెలంగాణలో అది 0.55 శాతానికి పడిపోయింది. దేశంలో కరోనా రికవరీ రేటు 91.7 శాతంగా ఉండగా రాష్ట్రంలో 92.12 శాతానికి పెరిగింది.

- Advertisement -