బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 57 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 57వ ఎపిసోడ్‌లో భాగంగా చివరివరకు ట్విస్ట్ ఇస్తూ ఎలిమినేషన్ లేదని ప్రకటించారు నాగార్జున. ఉత్కంఠ రేపుతూ అమ్మా రాజశేఖర్,మెహబూబ్ మధ్య పోటాపోటీ జరుగగా మెజార్టీ సభ్యులు మెహబూబ్‌కే మద్దతు తెలపడంతో మాస్టర్ ఎలిమినేట్ అయ్యారని ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ఈ వారం ఎలిమినేషన్ లేదని డైరెక్ట్‌గా కెప్టెన్ పోటీ దారుడిగా మాస్టర్ ఎంపికయ్యారని ప్రకటించారు నాగ్.
సండే ఫన్ డే కావడంతో మంచి గేమ్స్, సరదా టాస్క్‌లతో హోస్ట్ నాగార్జున నడిపించారు. నోయల్‌పై ఆగ్రహాన్ని కంటిన్యూ చేస్తూనే మాస్టర్,అవినాష్ తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ఈ క్రమంలో ఎంట్రీ ఇచ్చిన నాగ్…అవినాష్‌ని కూల్ చేశారు. తర్వాత గార్డెన్ ఏరియాలోని సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టాడు. టీమ్ ఏ లో అభిజిత్(లీడర్), హారిక, అమ్మ రాజశేఖర్, అరియానా, మెహబూబ్, టీమ్ బీలో అఖిల్(లీడర్), అవినాష్, సోహైల్, లాస్యలు ఉన్నారు. పాటకు సంబందించిన మ్యూజిక్ ప్లే అయితే.. వెంటనే పాటని గెస్ చేసి బజర్ ప్రెస్ చేయాలని సూచించారు.మొత్తం తొమ్మిది రౌండ్లలో పాటలకు ఇంటి సభ్యులు డ్యాన్స్‌లతో అదరగొట్టగా మొత్తానికి ఈ టాస్క్‌లో అఖిల్ టీమ్ గెలిచినట్లు నాగార్జున ప్రకటించారు.
అనంతరం నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేసే క్రమంలో తొలుత మోనాల్ సేవ్ అయినట్లు ప్రకటించారు. ఇక అవినాష్ కోసం ప్రత్యేక టాస్క్ తీసుకొచ్చిన నాగ్…హౌస్‌మేట్స్‌లో ఒక్కొక్కరిని ఇమిటేట్ చేసి చూపించాలన్నాడు. మొదటగా మోనాల్ అవినాష్‌ని ముద్దు పెట్టాక ఎలా బిహేవ్ చేస్తాడో చేసి చూపించాలని అరియానాను కోరగా అదరగొట్టింది. తర్వాత డైరెక్ట్‌గా అవినాష్‌కి మోనాల్ ముద్దు పెట్టగా అవినాష్ సంతోషంతో చిందుచేశాడు.
తర్వాత మోనాల్, అరియానాలను అవినాష్ ప్లర్ట్ చేసేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అఖిల్ చేసి చూపించాడు. మోనాల్ దగ్గరికి వెళ్లి కిస్ ఇవ్వగా అని అడిగాడు. పక్క ఉన్న అరియానా..అవినాష్ అంటూ దగ్గరకు రాగా .. మోనాల్ నాకు కిస్ ఇస్తా అంటే వద్దు అంటున్న అంటూ చక్కగా చేశాడు అఖిల్. అలాగే హారిక లాగా అవినాష్ ఇమిటేట్ చేస్తూ చిన్న పిల్లలా పరిగెడుతూ.. అభిజిత్‌ను హగ్ చేసుకున్నాడు. ఇక రాజశేఖర్ మాస్టర్ లాగా అవినాష్ ఇమిటేట్ చేస్తూ కోపంలో మాస్టర్ ఎలా మాట్లాడుతారో చూపించారు. ఇక అరియానా, లాస్యలను ఇమిటేట్ చేసిన అవినాష్.. ఓ రేంజ్‌లో నవ్వులు పూయించారు.ముఖ్యంగా పప్పు ఇష్యూ ఎపిసోడ్‌ను కళ్లకు కట్టినట్లు చూపించాడు అవినాష్.
ఇక నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగ్ చివరగా మెహబూబ్,మాస్టర్‌లు మిగిలారు. ఇంట్లో మెహబూబ్ ఉండాలని ఆరుగురు సభ్యులు కోరుకున్నారు. ఇద్దరు (అరియానా, అవినాష్) మాత్రమే రాజశేఖర్ ఉండాలని ఆశపడ్డారు. దీంతో మెహబూబ్ సేఫ్ అని ప్రకటించారు నాగ్. అయితే చివరలో ట్వీస్ట్ ఇస్తూ నోయల్ విజ్ఞప్తి మేరకు ఈ వారం ఎలిమినేషన్ లేదని అమ్మ రాజశేఖర్ కూడా సేఫ్ అని అన్నారు. అంతేగాదు ఎక్కువ ఓట్లు పడటంతో మాస్టర్ డైరెక్ట్‌గా కెప్టెన్ పోటీదారుడిగా ఎంపికయ్యారని తెలిపారు.