బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 45 హైలైట్స్

378
harika
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 4 విజయవంతంగా 44 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. మంగళవారం ఎపిసోడ్‌లో భాగంగా మనుషులు-రాక్షసులుగా ఇంటి సభ్యులను రెండు టీంలుగా విడదీసి రాక్షసులను మనషులుగా మార్చాలని తెలిపారు బిగ్ బాస్. దీంతో రాక్షసులు మంచి మనుషులతో ఆటాడుకోగా ఈ ఎపిసోడ్‌లో జరిగిన రెండు టాస్క్‌ల్లో మంచి మనుషులు గెలుపొందారు.

కొంటె రాక్షసులు.. మంచి మనుషులు టాస్క్ ఇస్తూ ఇందుకు సంబంధించిన కథను తెలిపారు బిగ్ బాస్. కొన్ని వందల సంవత్సరాల క్రితం బిగ్ బాస్ పురం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో సాధారణమైన జీవితం గడిపే మంచి మనుషులు ఉండేవారు. కానీ, కొన్ని కొన్ని సార్లు ఆ మంచి మనుషులను కొంత మంది కొంటె రాక్షసులు వచ్చి వారి పనులకు ఆటంకం కలిగించే వారు. వారిని అల్లరి పెట్టేవారు. చాలా ఇబ్బందులకు గురిచేసే వారు. అయితే ప్రజలు ఆ కొంటె రాక్షసులు చేసే పనులు పట్టించుకోకుండా వారి మానాన వారి పనులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొంటె రాక్షసులు ఎలాంటి పనులు చేసిన మంచి మనుషులు చాలా ఓపికతో మర్యాదగా వారి పనులు వారు చేసుకుంటూ వారిని మంచి మనుషులుగా మార్చాలని తెలిపారు బిగ్ బాస్‌.మంచి మనుషుల టీమ్ టాస్క్ ముగిసే సమయానికి కనీసం ముగ్గురు రాక్షసులను మంచివాళ్లుగా మారిస్తే విజేతలుగా నిలుస్తారని వెల్లడించారు.

కొంటె రాక్షసుల టీమ్‌లో అరియానా, మెహబూబ్, అఖిల్, అవినాష్, హారిక ఉండగా మంచి మనుషుల టీమ్‌లో అభిజీత్, నోయల్, లాస్య, రాజశేఖర్, దివి, సోహెల్, మోనాల్ ఉన్నారు. అంతే బజర్ మోగగానే రాక్షసుల కాస్ట్యూమ్స్ వేసుకున్న సభ్యులు రెచ్చిపోయారు. మంచి మనుషుల సామాన్లను చిందరవందర చేస్తూ ఆటాడుకున్నారు. ముఖ్యంగా అరియానా నిజంగా రాక్షసిలాగానే బిగ్ బాస్ పురంను కిష్కింధకాండ చేసేసింది. రాక్షసుడిగా అవినాష్‌ తనదైన డైలాగ్‌లతో అదరగొట్టాడు.

తొలి టాస్క్‌లో భాగంగా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న పువ్వులతో 50 దండలు అల్లాలని తెలపగా ఈ టాస్క్‌లో మంచి మనుషులు 54 దండలు అల్లి విజయం సాధించారు. దీంతో రాక్షసుడి తలలు రెండు పగలగొట్టి అఖిల్‌ను మంచి మనిషిగా మార్చారు.ఇక టాస్క్ 2లో భాగంగా 100 ప్రమిదలు చేయాలని తెలపగా మంచి మనుషులు 160 ప్రమిదలు చేసి మరో రెండు తలల పగలగొట్టి మెహబూబ్‌ను మంచి మనిషిగా మార్చాలని అతనికోసం వెతకగా చివరికి హారికను మంచి మనిషిగా మార్చేశారు. ఈ క్రమంలో హారిక కంటతడి పెట్టింది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌ మరింత ఆసక్తికరంగా జరగనుంది.

- Advertisement -