బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 29 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకుంది. చివరి వరకు రెండో ఎలిమినేషన్‌పై సస్పెన్స్ కొనసాగించడం,సండే ఫన్ డే వంటి టాస్క్‌లో అలా గడిచిపోయింది.
ఇక శనివారం ఎలిమినేట్ అయిన స్వాతిని వేదికపైకి పిలిచారు నాగార్జున. బిగ్ హౌస్‌లో స్వాతి జర్నిని చూపిస్తూ ఓ టాస్క్ ఇచ్చారు. కార్డులపై కొన్ని లక్షణాలు రాసి అవి హౌస్‌లో ఉన్న ఏ వ్యక్తికి సెట్ అవుతాయో తెలపాలన్నారు. స్టోర్ రూంలో నుంచి ఆ లక్షణాలు రాసున్న బోర్డులను సుజాతను తీసుకురమ్మని నాగార్జున చెప్పారు.
స్వాతి తీసిన మొదటి కార్డు మీద నక్క తోక తొక్కిన వారు అని ఉండగా ఈ కార్డు కుమార్ సాయికి సరిపోతుందని తెలిపింది. అమ్మ రాజశేఖర్ – నమ్మక ద్రోహి,పుకార్ల పుట్ట – సుజాత,సొహైల్ – దొంగ,లాస్య – అవకాశవాది,నోయల్ – గుడ్డిగా నమ్మేవారు,మెహబూబ్ – అనుసరించే వారు,మోనాల్ – ఏమార్చేవారు,అరియానా – ఓవర్ కాన్ఫిడెన్స్,హారిక – ట్యూబ్ లైట్,అభిజిత్ – అహంకారి,గంగవ్వ – చాడీల చిట్టా,అఖిల్ – గమ్యం లేని పక్షి అని తెలిపింది స్వాతి.
ఇక సన్‌డే అంటే ఫన్‌డే టాస్క్‌లో భాగంగా హౌజ్‌లో ఉన్న అబ్బాయిలంతా అమ్మాయిల్లా రెడీ అయ్యారు. అమ్మాయిలు అబ్బాయిల్లా సిద్ధమయ్యారు. వారిని జంటలుగా విడదీసి ఒక్కో ఎంటైర్‌టైన్ టాస్క్ ఇచ్చారు. అరియానా-సోహైల్ జంట సాంగ్స్‌లో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్, అమ్మ రాజశేఖర్-సుజాత జంట సీన్‌లో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ చేశారని తెలిపారు నాగ్.
తర్వాత ఇంటి సభ్యులతో కబడ్డీ గేమ్ ఆడించారు నాగార్జున. హౌజ్‌మేట్స్‌ను రెండు టీమ్‌లుగా విడదీసి ప్రతి కంటెస్టెంట్ వీపుకు ఒక బెలూన్ కట్టారు. కూతకు వెళ్లిన కంటెస్టెంట్ బెలూన్ పగలగొట్టి రావాలి. ఒకవేళ కూతకు వెళ్లినవారి బెలూన్‌ను అవతల టీమ్ పగలకొడితే కూతకు వెళ్లిన వ్యక్తి ఔట్. అవతల టీమ్ బెలూన్ పగలగొట్టి వస్తే ఒక పాయింట్ వస్తుంది. ఈ గేమ్ చాలా ఆసక్తికరంగా సాగింది.
ఇక చివరిగా డబుల్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చిన నాగ్ చివరి వరకు ఆ సస్పెన్స్‌ను అలానే కంటిన్యూ చేశారు. అభిజిత్, లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, దేత్తడి హారిక, సోహైల్‌లకు 1 నుంచి 6 నంబర్లు బోర్డులను ఏర్పాటు చేసి ఈ ఆరుగురిని ఒక్కో నంబర్ వద్ద నిలబడమని చెప్పారు. ఏ నెంబర్ వద్ద ఎవరు నిలబడాలో వారినే డిసైడ్ చేసుకోమని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో నెంబర్ వద్ద ఫిక్స్ కాగా చివరగా అంతా సేఫ్ అని ప్రకటించారు నాగ్. దీంతో ఎలిమినేషన్‌లో ఉన్న సభ్యులు ఉపిరి పీల్చుకున్నారు.