జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేడు…

125
gst council

నేడు 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామ‌న్ ఆధ్వ‌ర్యంలో జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ఆర్ధికమంత్రులు పాల్గొననున్నారు. ఈ సంద‌ర్భంగా జీఎస్టీ ప‌రిహారం చెల్లింపుల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

జీఎస్టీ ప‌రిహారం చెల్లింపుల విష‌యంలో కేంద్ర ప్ర‌తిపాద‌న‌లను బీజేపీ యేతర రాష్ట్రాలు వ్య‌తిరేకిస్తున్న సమయంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గ‌త స‌మావేశంలో జీఎస్టీ మండ‌లి చేసిన‌ రెండు ప్ర‌తిపాద‌న‌ల‌ను తెలంగాణ‌ ప్ర‌భుత్వం తిర‌స్క‌రించింది. తొలి ప్ర‌తిపాద‌న మేర‌కు రాష్ట్రానికి రూ.5 వేల కోట్లు, రెండో ప్ర‌తిపాద‌న ప్ర‌కారం రూ.10 వేల కోట్ల ప‌రిహారం రావాల్సి ఉంటుంద‌ని అంచ‌నా. ప‌రిహారాన్ని మొత్తం కేంద్ర‌మే చెల్లించాల‌ని..లోటును పూడ్చుకోవ‌డానికి రాష్ట్రాలు అప్పులు తీసుకోవాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది.