మంత్రి మల్లారెడ్డి పెద్దమనసు…

172
mallareddy

మంత్రి మల్లారెడ్డి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల అసెంబ్లీ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ నాగులు కుటుంబానికి బాసటగా నిలిచారు.

దమ్మాయిగూడలోని ఆర్‌జీకే కాలనీలో నివాసం ఉంటున్న నాగులు కుటుంబ సభ్యులకు మైసమ్మగూడలోని సీఎంఆర్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో రూ.2 లక్షలను అందజేశారు. అంతేకాక డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తమ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఆదుకున్న మంత్రి మల్లారెడ్డికి నాగులు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్‌ చైర్మన్‌ ప్రణీతతో పాటు పలువురు పాల్గొన్నారు.