అవినాష్ ఎలిమినేట్!

236
avinash
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మరో రెండు వారాల్లో ముగియనుంది. 13వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా ఈ సీజన్ బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన అవినాష్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్‌లో చివరగా అవినాష్,మోనాల్ మిగలగా ప్రేక్షకులు ఓటింగ్‌ తక్కువగా వేయడంతో అవినాష్ బయటకు వచ్చేశాడు.

వెళ్తూ వెళ్తూ ఇంటి సభ్యులను నవ్వించి వెళ్లాడు అవినాష్‌. ఇంటి సభ్యలను ఇమిటేట్ చేసి నాగార్జునకు చూపించాడు. నాగార్జున కూడా పగలబడి నవ్వారు. ముఖ్యంగా హారికను ఇమిటేట్ చేసినప్పుడు నాగార్జున బాగా నవ్వారు. తర్వాత అవినాష్ చేతికి నాగార్జున బిగ్ బాంబ్ ఇచ్చారు. వచ్చే వారం రోజులు ఏం పని చేయాల్సిన అవసరం లేదు. ఈ బాంబ్‌ను అభిజీత్‌పై వేశాడు అవినాష్.

ఇప్పటివరకూ బిగ్ బాస్ హౌస్ నుంచి సూర్యకిరణ్, కల్యాణి, దేవీ నాగవల్లి, స్వాతి దీక్షిత్, సుజాత, కుమార్ సాయి, దివి, అమ్మ రాజశేఖర్,మెహబూబ్‌,లాస్యలు ఎలిమినేట్ కాగా, ఆరోగ్యం బాగాలేదంటూ గంగవ్వ, నోయల్ బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -