బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 92 హైలైట్స్

247
epsiode 92
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 92 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 92వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులందరినీ నవ్విస్తూ ఈ వారం ఎలిమినేట్ అయ్యారు అవినాష్. ఇక ఈ సీజన్ బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా అవినాష్ నిలిచారని తెలిపారు నాగార్జున.

తొలుత రావడంతోనే ఇంటి సభ్యులను పలకరించారు నాగ్‌. యారోమ్ కి యార్ అనే గేమ్‌ ఇచ్చిన నాగ్….అందరికీ వైట్ బోర్డులు, మార్కర్లు ఇచ్చారు. ఒక్కో ఇంటి సభ్యుడిని లేపి అతనికి లేదంటే ఆమెకి నాగర్జున మూడు ప్రశ్నలు వేశారు. నిలబడిన సభ్యుడు బోర్డుపై సమాధానాలు రాయాల్సి ఉండగా అతడు ఏం రాశాడో గెస్ చేయాల్సిఉంటుంది…ఇలా నిలబడిన వ్యక్తి సమాధానంతో ఎవరి సమాధానాలు మ్యాచ్ అవుతాయో వారికి నిలబడిన వ్యక్తి ఒక రోజా పువ్వు ఇస్తాడు. ఆట ముగిసే సమయానికి ఎవరి వద్ద ఎక్కువ పువ్వులు ఉంటే వారు ‘యారోం కి యార్’.‌

మోనాల్ నిలబడగా నువ్వు అవినాష్‌ను ఎన్నిసార్లు ముద్దుపెట్టుకున్నావ్ అని నాగ్ అడగగా అవినాష్ మూడు సార్లు అనిచెప్పాడు. సమాధానం కరెక్ట్ కావడంతో మోనాల్ నవ్వుతూ పువ్వు మాత్రమే ఇచ్చింది. అయితే, అవినాష్-మోనాల్‌లది అన్న చెల్లెళ్ల అనుబంధం అని అఖిల్, సోహెల్ నవ్వుతూ అన్నారు. మొత్తం మీద ఈ ఆటలో సోహెల్ విజేతగా నిలిచి ‘అందరి బంధువయా’ అనే ట్యాగ్ వేయించుకున్నాడు.

తర్వాత నామినేషన్స్‌లో ఉన్న నలుగురిలో ఒకరిని సేవ్ చేయడానికి నాగార్జున ఆవును తీసుకొచ్చారు. ఒక్కొక్కరుగా ఆవు దగ్గరికి వెళ్లాలని ఎవరు వెళ్లినప్పుడు ఆవు అంబా అంటుందో వారు సేవ్ అయినట్లు అని తెలపగా అభిజిత్ సేవ్ అయ్యాడు.

ఇంటి సభ్యలతో ఆట,పాట,డ్యాన్స్‌లు వేయించారు నాగ్. అనంతరం హారిక సేవ్ కాగా మిగిలింది మోనాల్,అవినాష్‌. వీళ్లిద్దరి ముందు రెండు గాజు బౌల్స్ ఉంచారు. ఒక్కొక్కరికి ఒక్కో టెస్ట్ ట్యూబ్ ఇచ్చారు. ఈ టెస్ట్ ట్యూబ్స్‌లో ఉన్న ద్రావణాన్ని ఇద్దరూ ఒకేసారి ఎవరి బౌల్‌లో వారు పోయాలి. ఎవరి నీరు ఎరుపు రంగులోకి మారితే వాళ్లు ఎలిమినేట్ అయినట్టు అని తెలపగా అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. అవినాష్ ఎలిమినేట్ కాగానే అరియానా కంటతడి పెట్టుకుంది. బిగ్ బాస్ వేదికపైకి వెళ్లిన అవినాష్…ఒక్కొక్కరి గురించి చెబుతూ నవ్వించారు. తర్వాత బిగ్ బాంబ్‌లో భాగంగా వచ్చే వారం రోజులు ఏం పని చేయాల్సిన అవసరం లేదు ఈ బాంబ్‌ను అభిజిత్‌పై వేశాడు. దీంతో ఎపిసోడ్ ముగిసింది.

- Advertisement -