బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 16 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. హాట్ హాట్‌గా సాగిన ఈ నామినేషన్ ప్రక్రియలో మూడో వారానికి సంబంధించి ఏడుగురు కంటెస్టెంట్లు యాంకర్ దేవి, లాస్య, అరియానా గ్లోరి, కుమార్ సాయి, మెహబూబ్, మోనాల్ గజ్జర్, హారికలు నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురిలో ఒకరు వచ్చే వారం బ్యాగ్ సర్దేయనున్నారు.
ఇక 16వ ఎపిసోడ్ ఎలిమినేషన్ సందర్భంగా సోహైల్, అరియానా మధ్య పెద్ద గొడవే జరిగింది. అరియానాను నామినేట్ చేస్తూ సోహైల్ కొన్ని కారణాలు చెప్పడంతోపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
అరియానా గురించి ఏమిటో నాకు తెలుసని సోహైల్ అనగానే నీ గురించి నాకు బాగానే తెలుసు అంటూ అరియానా ఘాటుగా జవాబిచ్చారు. నా గురించి మాట్లాడటం నన్ ఆఫ్ బిజినెస్ అంటూ ఒకరిపైఒకరు గట్టిగా అరుచుకున్నారు. అలాగే అఖిల్ , కుమార్ సాయి మధ్య కూడా మాటల యుద్దం జరిగింది.మొత్తంగా మూడోవారం ఎంట్రీ అయ్యేసరికి బిగ్ హౌస్‌లో కుంపటి మొదలైంది.