భారీగా పడిపోయిన బంగారం ధర..

176
Gold Rate

పసిడి ధర భారీగా పతనమైంది. రెండురోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.53,820కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.49,340కు దిగొచ్చింది.

పసిడి బాటలోనే వెండి కూడా భారీగా పడిపోయింది. కేజీ వెండిపై ఏకంగా రూ. 900 తగ్గి రూ.67,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.30 శాతం పెరుగుదలతో 1916 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.87 శాతం పెరుగుదలతో 24.59 డాలర్లకు చేరింది.