బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 …బుధవారంతో నాలుగు ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. ఫస్ట్ వీక్‌లో ఎలిమినేషన్ జోన్‌లో అభిజిత్, అఖిల్, మెహబూబ్, సుజాత, దివి, సూర్యకిరణ్,గంగవ్వలు ఉండగా వీరిలో ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు. ఇక నాలుగో ఎపిసోడ్‌లో సీక్రెట్ రూం నుండి అరియానా,సొహైల్ హౌస్‌లోకి ఎంటరవడం రావడంతోనే అభిజిత్‌తో గొడవకు దిగడం,కొట్టుకునే వరకు వెళ్లగా మిగితా సభ్యుల ఓవరాక్షన్‌తో ఎపిసోడ్ 4 అలా సాగిపోయింది.
సీక్రెట్ రూం నుంచి సొహైల్, అరియానా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులకు సర్ ప్రైజ్ ఇవ్వగా రావడంతోనే తమ ఫోన్ ఎందుకు కట్ చేశారు అంటూ గొడవకు ఆజ్యం పోశారు. అయితే వారికి నోయల్ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా అభిజిత్ కలగజేసుకుని సొహైల్‌పై ఫైర్ అయ్యాడు. ఇద్దరూ ఒకర్నొకరు దూషించుకుంటూ హౌస్‌ని రణరంగంగా మార్చేశారు.
ఈ రచ్చ అనంతరం అరియానా మరో రచ్చకు తెరలేపింది. తనకు తినిపిస్తే తింటానని మారం చేయగా అఖిల్ తినిపించే ప్రయత్నం చేయగా నోయల్, అభిజిత్, హారికలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి అఖిల్ దగ్గర నుంచి ప్లేట్ తీసుకున్న కళ్యాణి నేను తినిపిస్తా అరియానా అంటూ ముద్దలు చేసి పెట్టింది.
తర్వాత దేవితో గొడవకు దిగింది కరాటే కల్యాణి… ముఖంపై తలుపు వేసినట్టు అలా లేచి వెళ్లిపోతావా?? అంటూ అడగడంతో నాకు నచ్చలేదు లేచి వచ్చేశా అని దేవి తేల్చిచెప్పింది. దీంతో నేను వెళిపోతా.. వీళ్లంతా నన్ను అర్థం చేసుకోవడం లేదు అంటూ సూర్యకిరణ్ దగ్గర తెగ ఏడ్చేసింది కళ్యాణి.