బిగ్ బాస్‌:100 రోజులు పూర్తి…మిగిలింది 5 రోజులే

462
big boss 3
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 తెలుగు సక్సెస్‌ ఫుల్‌గా 100 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సీజన్‌లో ఇదే చివరి వారం మిగిలింది 5 రోజులే కావడంతో ఎవరు గెలుస్తారా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఫైనల్‌ రేసులో శ్రీముఖి,వరుణ్,అలీ,బాబా భాస్కర్,రాహుల్ నిలిచారు. ఇక వందో ఎపిసోడ్‌లో యాంకర్ సుమ హౌస్‌ మెట్స్‌తో కలిసి సందడి చేశారు.

జూలై 21న కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్‌ 3 తెలుగు సీజన్‌ ప్రారంభమైంది. 15 మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ కార్డు ద్వారా మరో ఇద్దరు మొత్తం 17 మంది హౌస్‌లో అడుగుపెట్టగా ప్రస్తుతం టైటిల్ వేటలో 5గురు నిలిచారు.

ఈ ఆదివారం 3వ తేదీన ఫైనల్స్ జరగనుండగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు సమాచారం. ఫైనల్‌లో విజేతగా నిలిచిన వారికి రూ. 50 లక్షల బహుమతిగా అందజేయనున్నారు.

- Advertisement -