సోషల్ మీడియా యమ స్పీడ్‌గా ఉన్న ఈ రోజుల్లో చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల కదలికలు, వారి వ్యక్తిగత విషయాలపై నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపుతుంటారు. బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ ద్వారా బాగా పాపులర్ అయిన డెమాన్ పవన్, రీతూ చౌదరి జంట వ్యవహారం ప్రస్తుతం నెట్టింట పెద్ద దుమారమే రేపుతోంది.
రీసెంట్గా డెమాన్ పవన్ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెడుతూ, రీతూ చౌదరితో ఉన్న స్నేహ బంధానికి స్వస్తి పలికినట్లు క్లారిటీ ఇచ్చాడు. తమ మధ్య తీవ్రమైన గొడవలు అవుతున్నాయని, ఆ టార్చర్‌ను భరించలేకపోతున్నానని తెలిపాడు. రీతూ తనను అన్ని సోషల్ మీడియా ఖాతాల్లో బ్లాక్ చేసిందని, తాను కూడా ఆమెను బ్లాక్ చేశానని పేర్కొన్నాడు. ఇకపై తమ ఇద్దరి కాంబినేషన్ (రివన్ – Rivan) ఉండదని, కలిసి ఎలాంటి ప్రాజెక్ట్‌లు చేయమని స్పష్టం చేశాడు. అయితే ఆమెలాగా తాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు డిలీట్ చేయడం లేదని చెప్పుకొచ్చాడు.
ఈ పోస్ట్‌పై రీతూ చౌదరి అంతే ఘాటుగా స్పందించింది. “ఫ్రెండ్ షిప్లో గొడవలు రావడం సహజం, దానికి బ్రేకప్ అని రచ్చ చేయడం ఏంటి? మేమేమైనా లవర్సా? పెళ్లి చేసుకుంటున్నామని చెప్పామా?” అని ప్రశ్నించింది. వ్యూస్, లైక్స్ కోసం వీడియోలు, రివ్యూలు చేస్తూ జడ్జిమెంట్లు పాస్ చేసే వారిని ‘నిబ్బా గాళ్లు’ అంటూ ఘాటుగా విమర్శించింది. అయితే ఈ రచ్చ కారణంగా తనకు ఒక్క రోజులోనే 25 వేల మంది కొత్త ఫాలోవర్లు వచ్చారని, దానికి థ్యాంక్స్ అంటూ సెటైరిక్‌గా పోస్ట్ ముగించింది.
నిజానికి బిగ్ బాస్ ఇంట్లో ఏర్పడే బంధాలు ఎంతవరకు నిలుస్తాయనేది ఎప్పుడూ ప్రశ్నార్థకమే. గతంలో దీప్తి సునయన-తనీష్, రాహుల్-పునర్నవి, అభిజిత్-హారిక, షణ్ముఖ్-సిరి, విష్ణు ప్రియ-పృథ్వీరాజ్ వంటి ఎన్నో కాంబినేషన్లు హౌస్‌లో వైరల్ అయ్యాయి. కానీ బయటకు వచ్చాక చాలావరకు ఎవరి దారి వారిదే అన్నట్లు మారిపోయాయి. హౌస్ నుంచి బయటకు వచ్చాక ‘కుకు విత్ జాతిరత్నాలు’ వంటి షోలలో కలిసి నటించిన పవన్-రీతూల బంధం కూడా ఇప్పుడు ముగిసిపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
Also Read:ఇకపై ఆ పాత్రలు చేయను!
అయితే, ఈ వ్యవహారం వెనుక ఏదైనా అప్‌కమింగ్ సాంగ్ లేదా ప్రాజెక్ట్ ప్రమోషనల్ స్ట్రాటజీ ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం పబ్లిసిటీ హైప్ కోసమే ఈ డ్రామా ఆడుతున్నారా లేక నిజంగానే వీరి స్నేహానికి శుభం కార్డు పడిందా అనేది మున్ముందు తేలనుంది.

