బిగ్ బాస్ 4 …ఎపిసోడ్ 13 హైలైట్స్

215
episode 13
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 13వ ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 13వ ఎపిసోడ్‌లో గంగవ్వ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండగా బిగ్ బాస్ నిబంధనలు పాటించని వారికి శిక్ష విధించడం,కొత్త కెప్టెన్‌గా నోయల్ ఎంపిక,రాజశేఖర్ – దేవిల మధ్య వివాదంతో ముగిసింది.

తొలుత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన అవినాష్, కుమార్ సాయిలు రెండు టీంలుగా విడిపోయి కామెడీ స్కిట్‌లు చేశారు. గందరగోళం డ్రామా కంపెనీ అంటూ సాయి టీం సభ్యులు దేవి,దివి,హారిక,రాజశేఖర్ నవ్వించగా తర్వాత అవినాష్ టీం కరాటే కళ్యాణి, సుజాత, అఖిల్, మొనాల్‌లు ‘బకరా’ స్కిట్ చేసి ఈ టాస్క్‌లో గెలుపొందారు. అయితే మూడు నిమిషాలు స్కిట్ చేయమంటే అవినాష్ వాళ్లు 5 నిమిషాలు పైనే చేశారని.. నోయల్, లాస్యలు జడ్జిమెంట్

కరెక్ట్‌గా లేదని అసహనం వ్యక్తం చేశారు రాజశేఖర్ మాస్టర్. దీంతో బిగ్ బాస్ ఇద్దరిని జేతలుగా ప్రకటిస్తూ మ్యాంగో జ్యూస్ పంపించారు.తర్వాత ఇంటి సభ్యులందరూ డ్యాన్స్‌తో ఇరగదీశారు. దివి డాన్స్‌తో రచ్చ చేయగా ఎప్పటిలాగే మొనాల్-అభిజిత్‌లు మాత్రం తమ పనిలో తాము బిజీ అయ్యారు. ఇక కిచెన్‌లో తాను ఉంటానంటూ మొదటి నుంచి గొడవ చేస్తున్న దేవి మరోసారి లాస్యతో వాదనకు దిగింది. అయితే తనను పక్కన పెడుతున్నారని బాధ పడింది దేవి.

బిగ్ బాస్ ఇంటి నియమాలను ఎవరూ పాటించడం లేదని ఫైర్ అయ్యారు బిగ్ బాస్. మోనాల్, అభిజిత్, అఖిల్, నోయల్, హారికలు తెలుగులో కాకుండా ఇతర భాషల్లో మాట్లాడుతున్నారని వారికి శిక్షలు విధించారు. అమ్మా రాజశేఖర్, దేవి, మొనాల్, నోయల్, కళ్యాణి, దివిలు ఏ పనికి పిలిచిన చాలా ఆలస్యంగా ఇష్టానుసారంగా వస్తున్నారని, మైక్స్‌కి సరిగా ధరించడం లేదని వారికి కూడా శిక్ష వేశారు బిగ్ బాస్.

మొనాల్, అభిజిత్, అఖిల్, నోయల్, హారికలు బిగ్ బాస్ చెప్పే వరకు సుజాత దగ్గర తెలుగు నేర్చుకోవాలని ఆదేశించగా అలాగే సమయపాలన పాటించని వాళ్లు గుంజీలు తీయాలని.. కెప్టెన్ లాస్య దీనికి బాధ్యత వహిస్తూ.. తన వ్యక్తిగత వస్తువుని బెల్ మోగిన ప్రతిసారీ త్యాగం చేసి స్టోర్ రూంలో పెట్టాలని శిక్షలు విధించారు.

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన నలుగుర్ని ఇంటి సభ్యులు ఎన్నుకోవాలని బిగ్ బాస్ ఆదేశించారు. అయితే ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన.. నోయల్, మొహబూబ్, కళ్యాణి, అభిజిత్‌లను ఎన్నుకున్నారు. అయితే వీరిలో కెప్టెన్‌గా ఎక్కువ అర్హత ఉన్నది నోయల్‌కి మాత్రమే అని ఇంటి సభ్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో నోయల్ ఈవారం కెప్టెన్‌గా నోయల్ ఎంపికయ్యారు.

కిచెన్ టీంని మార్చాలాని రాజశేఖర్ మాస్టర్‌-దేవి మాట్లాడుకోగా తాను ఎందుకు మార్చాలంటున్నానో వివరణ ఇచ్చింది దేవి. అయితే లాస్య కిచెన్‌లో ఉంటే బాగా చేస్తుందని దేవి అనడంతో బాగా వండటం కాదు ఒకరికి నచ్చితే అది ఇంకొకరిక నచ్చుతుందని చెప్పలేం అని రాజశేఖర్ మాస్టర్ అనడంతో దేవి సీరియస్‌ అయింది. దీనికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు రాజశేఖర్ మాస్టర్.

పదేపదే మొనాల్‌ని అనుకరిస్తూ అవినాష్ కామెడీ చేస్తుండటంతో ఆమె సీరియస్ అయింది. మళ్లీ మళ్లీ ఇలా చేస్తే బాగోదు అంటూ వార్నింగ్ ఇవ్వగా అవినాష్ క్షమాపణ చెప్పడంతో ఎపిసోడ్ ముగిసింది.

- Advertisement -