సభ్యులందరినీ శిక్షించిన బిగ్ బాస్..

168
big boss

బిగ్ బాస్ సీజన్ 4 మొదలైన తర్వాత ఇప్పటి వరకు ఆటపాటలు.. ఏడపులు పెడబొబ్బులతో సాగిపోతోంది. అయితే సీజన్ మొదలై రెండు వారాలు కావొస్తున్నా కూడా ఇప్పటి వరకు జైలుకు వెళ్లడాలు.. బిగ్ బాస్ పిలిచి పనిష్‌మెంట్స్ ఇవ్వడాలు జరగలేదు.

ఇలాంటి సమయంలో బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు. ఈ సీజన్‌లో తొలిసారి అందరికీ శిక్ష వేశాడు. గంగవ్వ మినహా అందరితోనూ గుంజీలు తీయించాడు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. తదుపరి ఆదేశం వచ్చేవరకు ఇలాంటి శిక్షలు అమలు అవుతూనే ఉంటాయని చెప్పాడు బిగ్ బాస్. మరి శిక్ష వేయడానికి కారణం తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్ చూసితీరాల్సిందే.

Rules patinchakapotey punishment tappadu!! #BiggBossTelugu4 Today at 9:30 PM on #StarMaa