బంగారం ప్రేమికులకు శుభవార్త…

279
gold rate

బంగారం ప్రేమికులకు శుభవార్త..పసిడి ధర మరింత తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.470 తగ్గి రూ.53,550కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.430 తగ్గి రూ.49,090కు చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై ఏకంగా రూ.1,700 తగ్గి వెండి ధర రూ.67,800కు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.40 శాతం పెరుగుదలతో 1957 డాలర్లుకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.50 శాతం తగ్గుదలతో 26.96 డాలర్లుగా ఉంది.