మళ్లీ రేవంత్ వర్సెస్ రాజగోపాల్!

7
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి మధ్య మళ్లీ పంచాయతీ నెలకొంది. రేడియల్ రోడ్-2 టెండర్లపై రేవంత్ తీరుకు నిరసనగా హైకోర్టును ఆశ్రయించింది రాజగోపాల్‌కు చెందిన సుశీల్ ఇన్‌ఫ్రా.

రేడియల్ రోడ్ల టెండర్లలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా సంస్థను అనర్హులుగా ప్రకటించింది ప్రభుత్వం. అతి తక్కువ ధర కోట్ చేసిన సుశీ ఇన్‌ఫ్రాకు కాకుండా, రూ.600 కోట్లు ఎక్కువకు కోట్ చేసిన మరో మూడు సంస్థలకు కాంట్రాక్టు అప్పగించింది.ఎస్ఈ బదులు ఈఈ సంతకం ఉందనే చిన్న సాకుతో ఎల్–1గా ఉన్న సుశీ ఇన్‌ఫ్రాపై అనర్హత వేటు వేసింది.

రేవంత్ రెడ్డి సన్నిహితుల ఒత్తిళ్లతో అధికారులు కేవలం 6 రోజుల్లోనే చకచకా కాంట్రాక్ట్ అప్పగించారని ఆరోపణలు రాగా బుద్వేల్ ORR నుంచి కొడంగల్ వద్ద ఉన్న NH-167ఎన్ వరకు 81.15 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే కోసం టెండర్లను పిలిచింది హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL).

ఇందులోని ప్యాకేజీ-1ను అంచనా వ్యయం కంటే 3.95 శాతం అధికంగా కోట్ చేసిన NCC లిమిటెడ్‌కు రూ.1,286.03 కోట్ల కాంట్రాక్ట్ అప్పగించారు.ప్యాకేజీ-2 కింద బీవీఎస్ఆర్ సంస్థ, ప్యాకేజీ-3ని జీకేసీ సంస్థకు కేటాయించగా, ఈ సంస్థలు ఎంత ఎక్కువ కోట్ చేశాయన్న వివరాలను బయట పెట్టలేదు అధికారులు.ఈ మూడు సంస్థల కంటే తక్కువ ధర కోట్ చేసిన, అర్హత ఉన్న సుశీ ఇన్‌ఫ్రా బిడ్లను పక్కన పెట్టి కారణాలు కూడా తెలపలేదు అధికారులు.

దీంతో తమ కంటే రూ.600 కోట్లకు ఎక్కువ కోట్ చేసిన సంస్థలకు టెండర్లు కట్టబెట్టి, తమను రిజెక్ట్ చేశారని హైకోర్టుకు ఆశ్రయించింది సుశీ ఇన్‌ఫ్రా. గత నెల 30న టెండర్ల దాఖలుకు చివరి తేదీ కాగా, కేవలం 6 పని దినాల్లోనే సాంకేతిక మదింపు, అనర్హులపై వేటు, కమిటీ సిఫార్సులు రికార్డు చేయడం, ఆమోదాలు పొందడం, ఫైనాన్షియల్ బిడ్లు తెరవడం, కాంట్రాక్టులు అప్పగించడం వరకు చకచక జరగడం గమనార్హం. అంచనా వ్యయం కంటే తక్కువకు బిడ్ దాఖలు చేయకున్నా కూడా టెండర్లు దక్కించుకున్నాయి NCC, BVSR, GKC సంస్థలు.

Also Read:విమర్శలకు భయపడేది లేదు!

- Advertisement -