రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను సవాలు చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తిరస్కరించింది. ఈ విషయంలో ఆమెకు ఉన్న ఏకైక మార్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడమేనని కోర్టు స్పష్టం చేసింది.
నామినేషన్ పత్రాల తిరస్కరణలో మేము జోక్యం చేసుకున్నట్లు ఏదైనా తీర్పు ఉంటే మాకు చూపించండి అని అత్యున్నత న్యాయస్థానం నటరాజన్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఒక్కసారి నామినేషన్ తిరస్కరణకు గురైతే దానికి ఉన్న ఏకైక పరిష్కారం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడమే అని సుప్రీంకోర్టు పేర్కొంది.
Also Read:సింగ్ గీతం..పెద్ద బ్లాక్‌బస్టర్!
తన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ స్పందిస్తూ ఈ నిర్ణయం తన వ్యక్తిగత ఎదురుదెబ్బ కాదని, ప్రజాస్వామ్యానికి మరియు భారత రాజ్యాంగానికి తగిలిన దెబ్బ అని అన్నారు. ఎన్నికల సంఘం సభ్యులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని నేను మొదటి నుండి చెబుతున్నాను. మా ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినప్పుడు, వారికి 48 గంటల పాటు ఎలాంటి స్పందన రాలేదు. కనీసం సుప్రీంకోర్టు అయినా మా పిటిషన్‌ను ఆలకించి తీర్పునిచ్చింది అని ఆమె పేర్కొన్నారు.

