రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..

5
- Advertisement -

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువు నష్టం కేసులో బెంగళూరు స్పెషల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్‌ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రతీ పనిలోనూ 40% కమీషన్ తీసుకుంటోందని ఆరోపించారు. దీనిపై బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు గత వారం బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక రాహుల్‌ను కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించారు. దీంతో ఇవాళ న్యాయమూర్తి ఎదుకట విచారణకు హాజరయ్యారు రాహుల్. తదుపరి విచారణ జూలై 30కి వాయిదా వేస్తూ రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.

Also Read:భజే వాయు వేగం..మా నమ్మకాన్ని నిలబెట్టింది

- Advertisement -