యుక్రెయిన్‌కి సైనిక సాయం అందిస్తామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. వైట్ హౌస్ ఓవల్ కార్యాలయంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను చర్చించారు. రష్యన్ ఆక్రమణదారులను తిప్పికొట్టడానికి బిలియన్ల సాయం చేస్తామని వెల్లడించారు.
ఆయుధాలు, వైమానికి రక్షణ కోసం 325 మిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీ ఇచ్చినందుకు బిడెన్ కు కృతజ్ఞతలు తెలిపారు జిలెన్ స్కీ. రష్యన్ దిగ్బంధనం అనంతరం పొరుగున ఉన్న పోలాండ్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో యుక్రెయిన్ నుంచి ధాన్యం ఎగుమతిని విస్తరించడానికి బైడెన్ అంగీకరించారని చెప్పారు.
రష్యాతో సాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్‌కు మొదటి నుండి అండగా ఉంటూ వస్తోంది అమెరికా. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరి భేటీలో సైనిక సాయం అందిస్తామని బైడన్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read:IND VS AUS:తొలి మ్యాచ్ లో సత్తా చాటేదేవరు?