షాకింగ్ రోల్‌లో విజయ్ దేవరకొండ?

26
- Advertisement -

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల రిలీజ్ అయిన ఖుషీ మూవీతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. గీత గోవిందం తరువాత విజయ్ ఖాతాలో ఆ రేంజ్ విజయం ఒక్కటి లేదు. ఆ తరువాత వచ్చిన టాక్సీవాలా పరవలేదనిపించినప్పటికి వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ వంటి సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. దాంతో అదిరిపోయే ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ కి ఖుషీ మూవీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. .

గతంలో రామ్ చరణ్ కోసం సిద్దం చేసిన స్టోరీని గౌతమ్ తిన్ననూరి విజయ్ తో చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త ఫిలిమ్ సర్కిల్స్ లో తెగ హల్చల్ చేస్తోంది. అదేమిటంటే ఈ మూవీలో విజయ్ అమాయకపు కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడట. మూవీలో విజయ్ క్యారెక్టర్ ను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డిఫరెంట్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆ పాత్ర విజయ్ బరువు కూడా తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో పెళ్లి చూపులు, గీత గోవిందం వంటి మూవీస్ లో కొంత అమాయకత్వపు క్యారెక్టర్ తో అలరించాడు విజయ్. మళ్ళీ ఈ మూవీలో అలాంటి సమాజమైన పాత్రనే పోషిస్తుండడంతో ఈ మూవీ సూపర్ హిట్ గా నిలుస్తుందని రౌడీ స్టార్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందట. మరి ఈ మూవీతోనైనా విజయ్ దేవరకొండ హిట్ కొడతాడేమో చూడాలి.

Also Read:IND VS AUS:తొలి మ్యాచ్‌ లో సత్తా చాటేదేవరు?

- Advertisement -