మన నగరం పరిశుభ్రంగా ఉండాలంటే.. అందులో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి. దీనిపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఓ డాక్టర్ వినూత్న ప్రయత్నం చేశాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అభినిత్ గుప్తా అనే డాక్టర్.. తనకు తన తండ్రి 35 లక్షల విలువైన డీసీ అవంతి కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే ఆ కారుతో ఈ డాక్టర్ ఏంచేశాడో తెలిస్తే మీరు షాక్ అవ్యాల్సిందే..అదేంటనేగా మీ సందేహం.
35 లక్షల విలువైన ఆ లగ్జరీ కారుకి వెనుక ఓ ట్రాలీని కట్టారు. ఆ ట్రాలీలో తీసుకెళ్తున్నది ఏంటో తెలుసా.. రోడ్లపై ఉండే చెత్త. అవును మీరు విన్నది నిజమే.. ఆ కారుకు చెత్త ట్రాలీని కట్టి లాక్కెలి నగరం క్లీన్‌గా ఉండాలని తన వంతు భాద్యతను నిర్వర్తించాడు ఆ డాక్టర్. అంతేకాదు ఇలా తాను చేయడమే కాకుండా.. సెలబ్రిటీలకు మీరిలా చేయగలరా అంటూ సవాలు కూడా విసురుతున్నాడు. ఈ స్వచ్చ్ భారత్ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ముందు వరుసలో ఉన్నట్లు కూడా తేలింది.
ఈ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన ఆయన తండ్రి కూడా ఇప్పుడు తన తనయుడు చేస్తున్న పనిని మెచ్చుకుంటున్నారు. ఇక తాను చేయడమే కాకుండా క్రికెటర్లు ధోనీ, కోహ్లి, బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్, సల్మాన్‌ఖాన్‌లాంటి వాళ్లకు ఈ చాలెంజ్ విసిరాడు. దీన్నో సవాలుగా తీసుకుందాం. లగ్జరీ కార్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లండి అంటూ ఆ సెలబ్రిటీలందరినీ ట్యాగ్ చేశాడు.
https://twitter.com/drabhinitgupta/status/1005504821355532288