‘అభిమన్యుడు-2’ అంటుంన్న విశాల్‌..

233
Hero Vishal
- Advertisement -

గత కొద్ది కాలంగా హీరో విశాల్‌ తెలుగులో సరైన విజయం అదుకోలేపోయాడు. విశాల్‌ను పందెం కోడి సినిమా తర్వత చెప్పుకోదగ్గ విజయం వరించలేదు. తాజాగా తమిళంలో విజయవంతమైన ‘ఇరుంబుతిరై’ తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదలై పెద్ద హిట్టయింది. రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి విశాల్ కు తెలుగులో అతి పెద్ద హిట్టుగా నిలిచింది. మంచి టైమింగ్.. చక్కగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం ఈ సినిమాకు కలిసొచ్చింది. చక్కటి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్ తర్వాత బలంగా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తున్నాయి.

Hero Vishal

అటు తమిళంలో కూడా విశాల్ కు ఇది అతి పెద్ద హిట్టుగా నిలిచింది. అయితే ‘అభిమన్యుడు’ సినిమాతో హిట్‌ కొట్టిన హీరో విశాల్‌.. ‘పందెం కోడి’ సీక్వెల్ ను తెలుగులోనూ దసరాకి విడుదల చేయడానికి రెడీ అవుతోన్న విషయం తెలిసిందే. ఆ సినిమాలోనే కాకుండా ‘అభిమన్యుడు-2’లో కూడా తాను నటించనున్నట్లు విశాల్‌ ప్రకటించాడు.

తాజాగా విశాల్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘అభిమన్యుడు’ని ఇంతగా ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. తెలుగు ప్రేక్షకులు మొదటి నుంచి తననెంతో ఆదరిస్తున్నారని అన్నాడు. ఈ విజయం తనకు మరింత ఉత్సాహాన్నిచ్చిందని, త్వరలోనే ‘అభిమన్యుడు-2’ మొదలుపెట్టబోతున్నామని చెప్పాడు.

- Advertisement -