సంజయ్ దత్ జైలు నుండి వచ్చిన తర్వాత సినిమాల స్పీడు పెంచాడు. కొన్నాళ్ళుగా సంజయ్ దత్‌ని వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టైంలో మున్నాభాయ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో భూమి అనే సినిమా చేస్తున్నాడు సంజయ్. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భూమి చిత్రం తండ్రి, కూతురు నేపథ్యంలో రూపొందుతుంది. సందీప్ సింగ్ మరియు భూషన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని టీ- సిరీస్ బేనర్ పై నిర్మిస్తున్నారు.
సంజయ్‌దత్ 58వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి చిత్రం `భూమి` చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సంజయ్‌దత్ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ పోస్టర్ ట్విట్టర్లో ట్రెండ్‌గా మారింది. ఇందులో సంజయ్‌దత్ కూతురిగా అథితిరావ్ హైదరీ నటిస్తోంది. ఈ పోస్టర్లో సంజయ్ ముఖం మీద రక్తపు మరకలతో, చెదిరిన గడ్డంతో కనిపించారు. ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత విడుదలవబోతున్న సంజయ్ మొదటి చిత్రం ఇది.ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 22, 2017న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
Here's presenting the first official poster of #Bhoomi! @BhoomiTheFilm @OmungKumar @TSeries @LegendStudios1 @aditiraohydari pic.twitter.com/GndKVEfZ6q
— Sanjay Dutt (@duttsanjay) July 29, 2017