డిసెంబర్‌ 14న ఢిల్లో గులాబీ జెండా…

472
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆహర్నీశలు పోరాడిన పార్టీ భారత రాష్ట్ర సమితి ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌. కాగా నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 1.20 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ భార‌త రాష్ట్ర స‌మితి ప‌త్రాల‌పై సంత‌కం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేడీఎస్ చీఫ్ కుమార స్వామి, సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్, ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయ‌కులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్ కండువా ధరించారు. అంత‌కు ముందు ముందు భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… ఢిల్లీలో గులాబీ జెండా ఎగురెద్దాము అన్నారు. దేశ్ కి నేత కేసీఆర్, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, బిఆర్ఎస్ జిందాబాద్ నినాదాలతో మారుమోగింది. ఉత్తమమైన గుణాత్మకమైన మార్పు కోసం ఉన్నతస్థాయికి చేరుకునేందుకు డిసెంబర్ 14వ తేదీన ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకుందామని తెలిపారు.

అదే రోజు బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. పార్టీ ముఖ్యులంతా 13వ తేదీ సాయంత్రానికి ఢిల్లీ చేరుకోవాలి. మరో రెండు మూడు నెలల్లో మన సొంత బిఆర్ఎస్ భవనం పూర్తవుతుందన్నారు. అక్కడి నుంచే పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చన్నారు.

ఇవి కూడా చదవండి…

దేశ రాజకీయాల్లో ‘బీఆర్‌ఎస్’ ప్రభావమెంత?

ఢిల్లీలో గులాబీ జెండా :కేసీఆర్

ఉక్కు సంకల్పానికి కేంద్రం దిగొచ్చిన వేళ..

- Advertisement -