జోడో యాత్రలో ప్రియాంక కూతురు

133
- Advertisement -

కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర కొనసాగుతోంది. తమిళనాడులోని కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ యాత్ర కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ మీదుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కూడా పాల్గొంటున్నారు. ఇది వరకే కర్ణాటకలో భాగంగా సోనియా గాంధీ పాల్గొన్నారు. సోనియా గాంధీ డిసెంబర్‌ 9న పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్‌లోని రణతంభోర్‌లో పుట్టిన రోజు వేడుకలు చేసుకొన్నారు. దీంతో భారత్‌ జోడో యాత్రలో రెండవసారి సోనియా పాల్గొన్నారు.

తాజాగా రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, మరియు భర్త రాబర్ట్ వాద్రా కూడా భారత జోడో యాత్రలో పాల్గొన్నారు. అయితే ప్రియాంక వాద్రా కూతురు మిరయా వాద్రా కూడా రాహుల్‌తో కలిసి అడుగులు వేసింది. తొలిసారిగా భారత జోడో యాత్ర సందర్భంగా ప్రియాంక వాద్రా కూతురు మిరయా వాద్రా వార్తాల్లో నిలిచారు. ఫ్రిబ్రవరి 2023లో జమ్మూ కాశ్మీర్‌లో ఈ యాత్ర ముగియనుంది. మొత్తం 3570కి.మీ. దూరంను 150రోజుల్లో పూర్తిచేయనున్నారు.

ఇవి కూడా చదవండి…

రేవంత్‌కు షాక్..కొండా రాజీనామా

14న బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం..

గృహ సారధి, జగన్ కొత్త కాన్సెప్ట్ !

- Advertisement -