భారత్‌ బంద్‌ అప్‌డేట్..

198
bharath bandh
- Advertisement -

పెరిగిన పెట్రో ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లుంగ్‌లకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా సాగుతోంది. కేంద్రం తీరును నిరసిస్తూ కోట్లాది మంది రోడ్డెకక్కగా ఈ బంద్‌కు ఆల్ ఇండియా ట్రాన్స్‌పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ , సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు పలు ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు మద్దతు తెలిపాయి.

దేశవ్యాప్తంగా 40వేల వ్యాపార సంఘాలు, 8 కోట్ల మంది వ్యాపారులు బంద్‌కు మద్దతు తెలపడంతో పాటు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. బంద్‌తో 80 లక్షల రవాణా వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. మెడికల్‌, నిత్యావసరాలను బంద్‌ నుంచి మినహాయించారు.

పెట్రోల్ , డీజిల్ ధరలను అదుపు చేయడంతోపాటు ధరలు దేశమంతా ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు… అటు జీఎస్టీ నిబంధనల విషయంలో వ్యాపార, కార్మిక సంఘాలు అభ్యంతరాల వ్యక్తం చేస్తున్నాయి. GST అమలును పర్యవేక్షించడానికి, పన్ను బేస్ విస్తరించడానికి ప్రతి జిల్లాలో “జిల్లా జిఎస్‌టి వర్కింగ్ గ్రూప్” ను ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి.

- Advertisement -