- Advertisement -
దేశంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్,డీజీల్ ధరలు, జీఎస్టీకి నిరసనగా అఖిలభారత వ్యాపార సమాఖ్య నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో 40 వేల వర్తక సంఘాలకు చెందిన 8 కోట్ల మంది వ్యాపారులు, పలు కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు బంద్‌లో పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా 1500 ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతాయని తెలిపింది. మందులు, నిత్యావసరాలకు బంద్ నుంచి మినహాయింపునిచ్చారు.
భారత్ బంద్ నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేయగా బంద్‌కు ఒకరోజుకు సిలిండర్ ధరలను రూ. 25 పెంచాయి గ్యాస్ కంపెనీలు. ఈ నెలలో సిలిండర్ ధరలు పెరగడం ఇది మూడోసారి.
- Advertisement -