మూడో టెస్టులో భారత్‌ ఘన విజయం..

72
India beats England

అహ్మదాబాద్‌ మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ ను రెండు ఇన్నింగ్స్ ల్లోనూ తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన టీమిండియా… 49 పరుగుల విజయలక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. రోహిత్ శర్మ 3 ఫోర్లు 1 సిక్స్ తో 25 పరుగులు చేయగా, శుభ్ మాన్ గిల్ 1 ఫోరు, 1 సిక్స్ తో 15 పరుగులు సాధించిన వేళ… ఒక్క వికెట్టూ నష్టపోకుండా భారత్ గెలుపుతీరాలకు చేరింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులు చేయగా, భారత్ 145 పరుగులు చేసింది. ఆపై ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులకే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ మొత్తం 11 వికెట్లు తీయడం విశేషం అని చెప్పాలి. అశ్విన్ కు 7 వికెట్లు లభించాయి. ఈ టెస్టు విజయం అనంతరం నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 2-1తో ముందంజలో నిలిచింది. ఇరుజట్ల మధ్య చివరిదైన నాలుగో టెస్టు మార్చి 4 నుంచి ఇదే మైదానంలో జరగనుంది.

తొలి ఇన్నింగ్స్‌:
ఇంగ్లాండ్‌:112
భారత్‌:145

రెండో ఇన్నింగ్స్‌:
ఇంగ్లాండ్‌:81
భారత్‌:49