2 లక్షల లైక్‌లతో భరత్ ఫస్ట్ సాంగ్

194
- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. మహేష్ సరసన బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

భరత్ అనే నేను ఫస్ట్ ఇంపాక్ట్ దగ్గరి నుంచి సాంగ్ వరకు టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. శ్రీరామ నవమి సందర్బంగా ఈ సినిమా విడుదలైన ఫస్ట్ సాంగ్‌ను ఇప్పటివరకు 40 లక్షల మందికిపైగా చూశారు. అంతేగాదు రెండు లక్షల లైక్‌లతో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో మారింది.

ఇప్పటికే చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సినిమా యూనిట్‌ ఏప్రిల్ 7న వైజాగ్ లో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తోండగా అందరిలో ఆసక్తినెలకొంది. మహేష్‌-కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -