ఎన్టీఆర్ బయోపిక్..పోస్టర్

181
NTR biopic launched on March 29
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్‌ ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు పొలిటికల్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. మార్చి 29న సినిమా ప్రారంభం కానున్నట్లు దర్శకుడు తేజ ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. రామకృష్ణ స్టూడియోస్‌లో ఉదయం 9.30 గంటలకు క్లాప్ పడనుండగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం.

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. నేనే రాజు నేనే మంత్రితో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ…ఈ చిత్రాన్ని అందరికి నచ్చేలా తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడట. చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం బ్యానర్‌పై బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి అఫిషియల్‌గా ఎలాంటి న్యూస్ బయటికి రాలేదు. అయితే తాజాగా ఓ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. సినిమాలో ఏఏ అంశాలను చూపించబోతున్నారన్న విషయాన్ని తెలిపేలా పోస్టర్‌ ను రూపొందించారు. ఎన్టీఆర్ సొంత ఊరిలోని ఇళ్లు వెండితెరపై ఎన్టీఆర్ పోషించిన అ‍ద్భుత పాత్రలను కలిపి పోస్టర్‌ని డిజైన్‌ చేశారు. దీంతో పాటు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం,టీడీపీ స్థాపన,ఆయన ఉపయోగించిన ప్రచార రథంతో పాటు పార్టీ జెండా కూడా ఉండేలా డిజైన్ చేసిన పోస్టర్ అందిరిని ఆకట్టుకుంటోంది.

మరోవైపు దర్శకుడు రాంగోపాల్ వర్మ,కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిలు సైతం ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై సినిమాలు తీస్తుండగా అందరి దృష్టి మాత్రం తేజ-బాలయ్య కాంబినేషన్‌లో రానున్న సినిమాపైనే ఉంది.

NTR biopic  launched on March 29

- Advertisement -