- Advertisement -
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 120 రోజులు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్రంపై మరోసారి ఒత్తిడి పెంచేందుకు ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. లెఫ్ట్ పార్టీలతో పాటు పలు పార్టీలు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో రవాణా స్తంభించింది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు బంద్‌కు పిలుపునివ్వడం ఇది రెండోసారి . బంద్ తో రవాణా స్తంభించిపోగా అత్యవసర సర్వీసులు మినహా అన్నీ మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగుతుంది. ఈ బంద్ కు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, ఎస్పీ, ఆప్ తదితర పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. సాగు చట్టాలను కేంద్రం పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేస్తున్నారు.
- Advertisement -