అనుష్క ప్రధానపాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎవ్వడు పడితే వాడు రావడానికి … ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల గొడ్డా…భాగమతి అడ్డా…. లెక్కలు తేలాలి… ఒక్కడ్ని పోనివ్వను…. అంటూ అనుష్క భాగమతి ట్రైలర్ లో చెప్పిన హై పిచ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
జనవరి 26న రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో యూనిట్ .. సాంగ్స్, ప్రమోషనల్ వీడియోతో మూవీపై మరింత ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా విడుదలైన వీడియోలో మూవీ మేకింగ్ తో పాటు అనుష్క కి సంబంధించిన కొన్ని సన్నివేశాలని కొత్తగా చూపించారు.
పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన భాగమతిలో ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. విద్యు రామన్, జయరాం, ఉన్ని ముకుందన్ మరియు ఆశా శరత్ సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. భాగమతి చిత్రాన్ని తెలుగులోనే కాక తమిళం, మలయాళ భాషలలోను డబ్ చేసి విడుదల చేస్తున్నారు.