రివ్యూ: భాగమతి

665
Bhaagamathie movie review
- Advertisement -

అరుంధతి , రుద్రమదేవి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో టాప్ హీరోలతో పోటీగా మార్కెట్ సంపాదించిన అనుష్క.. బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించింది. తాజాగా భాగమతితో ప్రేక్షకుల ముందుకువచ్చింది. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీ ఫస్ట్ లుక్,టీజర్‌లతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బాహుబలి తర్వాత అనుష్క…భాగమతితో ఆకట్టుకుందా..?లేదా చూద్దాం..

కథ :

సెంట్రల్‌ మినిస్టర్ ఈశ్వర్‌ ప్రసాద్‌ (జయరామ్‌) నిజాయితీ గల రాజకీయనాయకుడు. ప్రజల్లో ఆయనకున్న మంచిపేరును చూసి ఓర్వలేని ప్రత్యర్థులు ఆయన్ని ఎలాగైన కేసులో ఇరికించాలని ఆ బాధ్యతను సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వైష్ణవి నటరాజన్‌(ఆశా శరత్)కు అప్పగిస్తారు.ఈశ్వర్‌ ప్రసాద్ ను ఇరికించేందుకు ఆయన దగ్గర రెండు సార్లు సెక్రటరీగా పనిచేసిన చెంచలా ఐఏఎస్‌ (అనుష్క)ను విచారించాలని నిర్ణయించుకుంటుంది. ఊరికి దూరంగా అడవిలో ఉన్న భాగమతి బంగ్లాలో విచారించాలని నిర్ణయిస్తారు. బంగ్లాలోకి ఎంటర్‌ అయిన తర్వాత ఏం జరుగుతుంది..? అనుష్క న ప్రియుడ్ని ఎందుకు చంపాల్సి వచ్చింది..? అన్నదే భాగమతి కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ అనుష్క నటన,నేపథ్య సంగీతం,తమన్ సంగీతం,నిర్మాణ విలువలు. భాగమతి పాత్రలో అనుష్క ఒదిగిపోయింది. ఐఏఎస్‌ ఆఫీసర్‌ చెంచలగా హుందాగా కనిపించిన స్వీటీ, భాగమతిగా రౌద్రాన్ని అద్భుతంగా పలికించింది. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో జయరామ్‌ నటన ఆకట్టుకుంటుంది. హీరోగా నటించిన ఉన్ని ముకుందన్ ది చిన్న పాత్రే అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, ధనరాజ్, విధ్యుల్లేఖ రామన్ లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.

Bhaagamathie movie review

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్ పార్ట్‌ లు పార్ట్‌ లుగా రావటం. కొన్ని జరగని సన్నివేశాలు జరిగినట్టుగా భ్రమ కలిగించటంతో ఆడియన్స్‌ కాస్త తికమక పడే అవకాశం ఉంది.హారర్‌ ఎలిమెంట్స్‌తో పాటు, పతాక సన్నివేశాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడ్డాయి. అద్భుతమైన టేకింగ్‌, థ్రిల్లింగ్‌ విజువల్స్‌లో ఆడియన్స్‌ను కట్టి పడేశాడు దర్శకుడు అశోక్. ముఖ్యంగా భాగమతి బంగ్లాలో జరిగే సన్నివేశాలు వావ్ అనిపిస్తాయి. సినిమాకు మరో మేజర్‌ ప్లస్ పాయింట్‌ తమన్ మ్యూజిక్‌,బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సీన్స్ ను మరింతగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రాఫి కూడా సినిమాను మరో మెట్టు ఎక్కించింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్ధాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు:

గత ఏడాది చిత్రాంగద లాంటి థ‍్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశోక్‌ ఈ ఏడాది, అనుష్క లీడ్ రోల్‌ లో తెరకెక్కిన భాగమతి సినిమాతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అనుష్క నటన,నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ కాగా అక్కడక్కడా తికమకపెట్టే సన్నివేశాలు మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా భాగమతితో స్విటీ మరోసారి మ్యాజిక్ చేసింది.

విడుదల తేది:26|01|18
రేటింగ్:3|5
నటీనటులు : అనుష్క, ఉన్ని ముకుందన్‌
సంగీతం : తమన్‌.ఎస్‌
నిర్మాత : వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌
దర్శకత్వం : జి. అశోక్‌

- Advertisement -