ఆలస్యమైన వర్షాలు కురుస్తాయి:రంగం స్వర్ణలత

46
- Advertisement -

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బోనాల వేడుకల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలస్యమైన ఈ ఏడాది వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని తెలిపారు.

ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నా అని తెలిపారు. కావాల్సిన బలాన్నిచ్చానని.. మీ వెంటా ఉంటానని స్వర్ణలత చెప్పారు. తన వద్దకు వచ్చే ప్రజలను కాపాడే భారం తనదేనని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరుగుతాయని.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వర్ణలత చెప్పారు.

Also Read:ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు..జనజీవనం అస్తవ్యస్తం

ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రంగం భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Also Read:Telangana Rains:భారీ వర్ష సూచన

- Advertisement -