మరిచాసనంతో ఆ సమస్యలు దూరం!

20
- Advertisement -

కూర్చొని వేయు ఆసనాలలో మరిచాసనం కూడా ఒకటి. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ముఖ్యంగా వెన్నెముకకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా వెన్నునొప్పి సమస్యలు దూరం అవుతాయి. ఇంకా కాళ్ళ వాతం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఆసనం తప్పకుండా వేయాలి. కాళ్ళ యొక్క నరాలను సడలించడంలో ఈ ఆసనం ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇంకా శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.ఊపిరితిత్తుల పని తీరును మెరుగుపరుస్తుంది.గుండె యండలి భాగాలను బలపరుస్తుంది. గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా మరిచాసనం ఎంతో ఉపయోగ పడుతుంది. ఇంకా గాల్ బ్లేడర్, కిడ్నీ సంబందిత సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం వేస్తే వాటి నుంచి విముక్తి పొందవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇక చక్కెర వ్యాధితో భాదపడే వాళ్ళు కూడా ఈ ఆసనం ప్రతిరోజూ వేస్తే షుగర్ కంట్రోల్ లోకి వస్తుందట.

మరిచాసనం వేయు విధానం

నేలపై లేదా యోగా షీట్ పై కాళ్ళు చాపుకొని కూర్చోవాలి. కాళ్ళను భూమికి సమాంతరంగా పూర్తిగా నేలకు ఆనించేలా చాపుకోవాలి. ఆ తరువాత ఎడమ కాలును మోకాలు వరకు మడిచి పూర్తిగా వెనక్కి లాగుతూ ఫోటోలో చూపిన విధంగా చేయాలి. ఆ తరువాత చేతులను వెనుకకు చాపి, కుడి చేతితో, ఎడమ చేతిని గట్టిగా పట్టుకొని ఫోటోలో చూపిన విధంగా మెల్లగా కుడివైపుకు తల తిప్పాలి. ముడుచుకున్న కాలు చేతుల మద్యలో ఉండేలా చేసుకోవాలి. ఈ స్థితిలో వీలైనంతా సేపు ఉంటూ ఆ తరువాత కుడి కాలుతో కూడా ఇదే విధంగా చేయాలి.

గమనిక
హెర్నియా, భీజకోశ వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయరాదు.

Also Read:నాగబాబుతో అల్లు అర్జున్ భేటి…

- Advertisement -